దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో గ్రాప్ 1 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) ఆంక్షల్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికీ ఢిల్లీలో వాయు కాలుష్య నాణ్యత పూర్ కేటగిరిలో ఉంది. బుధవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 223గా నమోదైంది.
వాయు కాలుష్యం పెరగడం, ప్రజలు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రాప్ 1 ఆంక్షల్ని మొదటిసారిగా అమలు చేస్తున్నల్టు ఢిల్లీ పర్యవరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. దీని ప్రకారం ప్రజలు వాయు కాలుష్యానికి కారణమయ్యే కొన్ని చర్యల్ని ఆపేయాల్సి ఉంటుంది. గ్రాప్ 1 ప్రకారం ఢిల్లీలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర చోట్లా ఎక్కడా వంట కోసం బొగ్గును వాడకూడదు. డీజిల్ జనరేటర్లను కూడా అత్యవసర పరిస్తితుల్లో తప్ప వాడరాదు.
“ఢిల్లీ చాలా సంవత్సరాలుగా తీవ్రమైన వాయు కాలుష్యంతో పోరాడుతోంది. గత ప్రభుత్వం సాకులు చెబుతూనే ఉండగా, మేము కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాము. మా ప్రయత్నాలలో ప్రజల భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కలిసి పనిచేస్తూ, మేము 11 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నాము. దుమ్ము నివారణ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, వాహన ఉద్గారాలను నియంత్రించడం మరియు స్థానిక కాలుష్య మూలాలను గుర్తించడంపై మా దృష్టి ఉంది,” అని మంత్రి సిర్సా వివరించారు.
తీసుకున్న కొన్ని చర్యలను వివరిస్తూ, సిర్సా మాట్లాడుతూ, చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం లభించదని, మెట్రో పార్కింగ్ సౌకర్యాలు మినహా ఢిల్లీ అంతటా పార్కింగ్ ఛార్జీలు రెట్టింపు అవుతాయని తెలిపారు. వాహనాల రాకపోకలను తగ్గించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వ కార్యాలయాలలో విడతల వారీగా పని గంటలు, అలాగే ఇంటి నుండి పని చేసే ఏర్పాట్లను కూడా ప్రవేశపెట్టనున్నారు.
“బహిరంగ నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయి. బహిరంగంగా కాల్చడం కూడా ఖచ్చితంగా నిషేధించబడింది,” అని మంత్రి తెలిపారు. ధూళి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ వ్యాప్తంగా 608 యాంటీ-స్మాగ్ గన్లు, 1,150 మిస్ట్-స్ప్రే యూనిట్లను మోహరించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీ పరిధిలో పూర్ కేటగిరిలో వాయు కాలుష్యం ఉంది. ఇలాంటప్పుడు గ్రాప్-1 ఆంక్షల్ని అమలు చేస్తారు. దీనివల్ల గాలిలోకి దుమ్ము, ధూళి, కాలుష్యం తక్కువగా వెలువడుతుంది. రోడ్డుపై వాహనాలు వెలువడుతున్నప్పుడు డస్ట్ రాదు. వివిధ నిర్మాణాలు, కూల్చివేతల సందర్భంగా కూడా దుమ్ము, ధూళి వెలువడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో అధికారులు తనిఖీలు చేపడుతారు.

More Stories
టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. మరో నలుగురు అరెస్ట్
మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి
ఆలయం వద్ద భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. 15 మంది మృతి