జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూ కాశ్మీర్‌ నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ ఘటను శుక్రవారం అర్ధరాత్రి 3.00 గంటల తర్వాత, జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలో జరిగింది. భారత్-పాక్ సరిహద్దు అయిన లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌వోసీ) వద్ద, కెరాన్ సెక్టార్‌లోని, జగ్‌మండ్ ఏరియాలో శనివారం వేకువఝామున ముగ్గురు, నలుగురు వ్యక్తులు రహస్యంగా భారత్ వైపు రావడాన్ని భారత భద్రతా దళాలు గుర్తించాయి.

ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా ఎల్‌వోసీ నుంచి సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చేందుకు తీవ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భారత భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో ఉగ్రవాదులు కూడా మన సిబ్బందిపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భారత ఆర్మీ ఎదురు కాల్పులు జరిపింది. వారిని గాలిస్తూ కాల్పులు జరపడంతో ఇద్దరు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, ఈ ప్రాంతం మొత్తం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది. తీవ్రవాదులు అక్రమ చొరబాటుకు ప్రయత్నించారని, ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మరణించారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, ఈలోపు ఇంకా ఎవరైనా భారత్ లోకి చొరబడ్డారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ఈ కాల్పులు జరిగిన ప్రాంతం పర్వతాలతో కూడి, నిర్మానుష్యంగా ఉంది. అందువల్ల అక్కడ ఉగ్రవాదుల్ని గుర్తించడం, వెంటనే స్పందించడం కొంచెం కష్టమైన విషయం. అయినప్పటికీ, ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు అక్కడ దాక్కుని ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

About The Author