కాంగ్రెస్ నేతల జేబులు నింపడానికే కాచిగూడ ఎస్సీ హాస్టల్ బలి

కాగా,  పేద విద్యార్థుల సంక్షేమ వసతి గృహాల్లో రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందని బిజెపి అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని పేర్కొంటూ బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ‘నాకాఫ్’ సంస్థకు రెడ్ కార్పెట్ పరిచిందని, బీసీలను నిలువునా వంచిస్తున్నదని ఆయన తూర్పారపట్టారు. 
 
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల పరిధిలోని మూడు వేలకు పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరా పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.800 కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపిందని తాడూరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 
 
పారదర్శకత పేరిట కేంద్రీకృత టెండర్లు పిలిచి, గతంలో పలు రాష్ట్రాల్లో తీవ్ర అవినీతి ఆరోపణలతో బ్లాక్ లిస్ట్‌లో ఉంచిన ‘నాకాఫ్’ సంస్థకు ఈ వందల కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక భారీ ముడుపులు చేతులు మారాయని ఆయన ఆరోపించారు.  

About The Author