ఆర్థికశాస్త్రంలో 2026 సంవత్సరానికి ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. అమెరికాలో జన్మించిన ఆర్థికవేత్తలు రాబర్ట్ ఇ. హాల్ మైఖేల్ వుడ్‌ఫోర్డ్, స్థూల ఆర్థిక స్థిరీకరణ సూక్ష్మ ఆర్థిక పునాదులపై చేసిన కృషికి గాను, సోమవారం నాడు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ స్మారక బహుమతిని గెలుచుకున్నారు. హాల్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి, వుడ్‌ఫోర్డ్ న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నారు.
స్థూల ఆర్థిక స్థిరీకరణ కోసం అవసరమైన సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలను రూపొందించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తన ప్రకటనలో పేర్కొన్నది. స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ పేరుతో ఆర్థికశాస్త్రంలో అవార్డు అందజేస్తారు. ఈ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన స్థూల ఆర్థిక మోడల్స్‌తో స్థిరీకరణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది.
ఆర్థిక స్థిరీకరణ కోసం వీళ్లు రూపొందించిన మోడళ్లతోనే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు, ప్రభుత్వాలు తమ ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్నట్లు నోబెల్ కమిటీ చెప్పింది.
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న నమూనాలకు, ఈ పురస్కార గ్రహీతల కృషి ఒక స్థిరమైన సైద్ధాంతిక పునాదిని అందించింది,” అని ఆర్థిక శాస్త్ర పురస్కార కమిటీ చైర్మన్ జాన్ హాస్లర్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. “వీటి సహాయంతో, ఇంధన సంక్షోభాలు లేదా గృహాల వినియోగంలో వచ్చే ఆకస్మిక మార్పుల వంటి ఆర్థిక వ్యవస్థలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి మనం మరింత సమర్థవంతంగా సిద్ధమయ్యాము” అని తెలిపారు.
ఆర్థిక ఒడిదిడుకులను ఎదుర్కొనే రీతిలో ఆ మోడళ్లు ఉన్నట్లు కమిటీ పేర్కొన్నది. ఇంధనం సంక్షోభం, గృహ వినియోగాల్లో జరిగే ఆకస్మిక మార్పులను ఎదుర్కొనే రీతిలో స్థూల, సూక్ష్మ విధానాలను రూపొందించారు. స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్విడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. వ్యాపారంలో ఆవిష్కరణలపై స్టడీ చేసిన ముగ్గురు ఆర్థికశాస్త్రవేత్తలకు గత ఏడాది నోబెల్ అవార్డు దక్కింది. కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలతో ఎలా ఆర్థికవృద్ధి, మానవ సంక్షేమం జరుగుతుందో ఆ శాస్త్రవేత్తలు నిరూపించారు.
ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ సైన్సెస్ అంటారు. టెక్నికల్‌గా ఎకనామిక్స్ ప్రైజ్ ను నోబెల్ ప్రైజ్‌గా గుర్తించారు. కానీ డిసెంబర్ 10వ తేదీన అన్ని ప్రైజ్‌లతో పాటు ఎకనామిక్స్ అవార్డును కూడా అందజేస్తారు.

More Stories
రియాద్ విమానాశ్రయంపై హౌతీ క్షిపణి దాడి, 14 మంది మృతి
కెప్టెన్ మచ్చార్‌ను జెరూసలంకు ఇజ్రాయెల్ అధ్యక్షుడి ఆహ్వానం
రష్యా, ఉక్రెయిన్ మధ్య తక్షణమే `ఇంధన కాల్పుల విరమణ’