* 34 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు – ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. వార్డుల పునర్విభజన అడ్డుకోవడం, ఎన్నికలకు ఆటంకం కలిగించడమంటే ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇబ్బంది పడేవారికి లేని బాధ మీకెందుకని వైఎస్సార్సీపీ లాయర్ను కోర్టు నిలదీసింది. ఎన్యూమరేటర్లు, ప్రభుత్వం, కేంద్రం ఎవరికీ లేని నొప్పి మీకెందుకని ప్రశ్నించింది.
కాగా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. 34 శాతం కోటాతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం నిరాకరించింది. బీసీల డేటా సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను పక్కనబెట్టి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఏ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకున్నారంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక అమలు చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, ఎక్కడ ఉందని జస్టిస్ దీపాంకర్‌దత్త ధర్మాసనం ప్రశ్నించింది.
నివేదిక ఆధారంగా ఫ్యామిలీ డేటాను పరిగణనలోకి తీసుకుంటారని ధర్మాసనం వ్యాఖ్యానించగా, నివేదిక ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరించారు. నివేదిక ఆమోదం లేకుండా డేటా తీసుకోవడంలో హైకోర్టు కారణం సరిగానే ఉందన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

More Stories
గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాదిలో అద్భుత ఫలితాలు
ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్వర్క్ కలకలం
ఇంటి నుంచే దుర్గమ్మ దర్శనం టికెట్లు బుకింగ్