ఇకపై సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. అక్టోబర్ 1 నుంచి ఆ నిబంధన అమల్లోకి రానుంది. ఈ మేరకు శనివారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న దేశీయ ఎల్పీజీ వినియోగదారుల్లో 89.9 శాతం మంది ఇప్పటికే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మొత్తం 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఇప్పటికే అథెంటికేషన్ పూర్తి చేసిన వినియోగదారులు ఇక ఎలాంటి అదనపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటివరకు మాదిరిగానే సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయని వినియోగదారులు కూడా ఎల్పీజీ పొందొచ్చు.
అయితే సబ్సిడీతో, ప్రభుత్వం నిర్ణయించిన నియంత్రిత రిటైల్ ధరకు రీఫిల్ బుక్ చేసుకోవాలంటే ముందుగా అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వినియోగదారులు తమకు అనుకూలమైన విధంగా పూర్తి చేసుకోవచ్చు. సిలిండర్ డెలివరీ సమయంలోనే డెలివరీ సిబ్బంది ద్వారా అథెంటికేషన్ చేయించుకోవచ్చు. లేదా సంబంధిత ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌కు వెళ్లి పూర్తి చేయొచ్చు.
అంతేకాకుండా ఇంటి నుంచే మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్ అథెంటికేషన్ చేసుకునే అవకాశం ఉంది. దేశంలోని మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ వినియోగదారుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా అథెంటికేషన్ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇండేన్ వినియోగదారులు IndianOil ONE యాప్‌ను ఉపయోగించవచ్చు.
భారత్‌గ్యాస్ వినియోగదారులు HelloBPCL యాప్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు HP PAY యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే ఇంటి నుంచే ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

More Stories
భారీగా తగ్గనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు!
టాటా సన్స్ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్.. చెల్లదన్న నోయెల్ టాటా
ఇకపై మెడికల్ స్టోర్లలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి