అతడు ఉగ్రసంస్థ అల్ ఖైదా ఇండియా నెట్‌వర్క్ కోసం పని చేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లో అనేక మంది యువతను తన నెట్‌వర్క్ కోసం పనిచేసేలా ప్రేరేపిస్తున్నాడు. ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా యువతను ఉగ్రవాదం వైపు నడిచేలా ప్రోత్సహిస్తున్నాడు. తన సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారిని జిహాద్ వైపు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం నిధులు సేకరించి, దేశంలో హింసకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నాడు.
అలాగే, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఘాజ్వా ఇ హింద్ సంస్థ కోసం కూడా పని చేస్తున్నాడు. నబీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అతడు పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకోవాలని కూడా ప్రణాళికలు రూపొందించాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో బాంబుల తయారీపై శిక్షణ తీసుకోవాలనుకున్నాడు.
అతడు నిర్వహిస్తున్న సోషల్ మీడియా గ్రూపులలో బాంబు తయారీకి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా షేర్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి ఎక్కువ మంది యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేసి, వారి ద్వారా దేశంలో హింసకు పాల్పడాలని నబీల్ ప్రయత్నించాడు. ఇందుకోసం పాకిస్తాన్ సాయం తీసుకోవాలని కూడా భావించాడు. నబీల్ ఫ్లేమ్స్ ఆఫ్ వార్ అనే వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగగా ఉన్నాడు. ఈ గ్రూపులో బంగ్లాదేశ్, మయన్మార్, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన సభ్యులున్నారు.

More Stories
జమ్మూ కాశ్మీర్లోని 10 ఉగ్రవాద స్థావరాలపై ఎన్ఐఏ సోదాలు
హాలీవుడ్ రేంజ్లో ఏడు భాగాలుగా ‘శ్రీమద్భాగవతం’ మహాగాథ!
ఆరేళ్ళ తర్వాత జరిగిన సెన్సార్ బోర్డు భేటీ!