భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు
భార‌త్ వ‌ద్ద సుమారు 190 అణ్వాయుధాలు ఉన్న‌ట్లు అమెరికాకు చెందిన ఫెడ‌రేష‌న్ ఆఫ్ అమెరిక‌న్ సైంటిస్ట్స్ త‌న రిపోర్టులో పేర్కొన్న‌ది.  ‘ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్-2026’ పేరుతో ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ డైరెక్టర్ హాన్స్ క్రిస్టెన్సెన్ ఓ కథనం రాశారు.  భారత్ వద్ద 190 అణు వార్‌హెడ్లు ఉన్నట్లు అంచనా వేశారు. ఇందులో 160 ఆపరేషనల్ లాంచర్ల కోసం సిద్ధంగా ఉండగా మరో 30 కొత్త క్షిపణుల కోసం ఉత్పత్తి దశలో ఉన్నాయని తెలిపారు.
దాయాది దేశం పాకిస్థాన్‌ కంటే భారత్‌ వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. అణ్వాయుధ నిల్వల్లో భారత్‌ త్వర లో యూకేను కూడా అధిగమిస్తుందని అంచనా వేసింది.   దీంట్లో అద‌నంగా కొత్త క్షిప‌ణుల కోసం 30 వార్‌హెడ్స్ ఉన్న‌ట్లు తెలిపింది. ప్ర‌భుత్వ డేటా, క‌మ‌ర్షియ‌ల్ శాటిలైట్ ఇమేజ్‌లు, ఓపెన్ సోర్స్‌ల ద్వారా ఆ అంచ‌నా వేసిన‌ట్లు ఎఫ్ఏఎస్ వెల్ల‌డించింది. 

గాలి, నేల, సముద్రం ద్వారా ప్రయోగించగల అణువ్యవస్థలను భారత్ వేగంగా అభివృద్ధి చేస్తోందని హాన్స్‌ క్రిస్టెన్సెన్‌ పేర్కొన్నారు. 2026 ప్రారంభం నాటికి భారత్ వద్ద సుమారు 730 కిలోల వెపన్- గ్రేడ్ ప్లుటోనియం ఉన్నట్లు అంచనా వేశారు. ఒక్కో వార్‌హెడ్‌కు 4 కిలోల ప్లుటోనియం అవసరం అనుకున్నా ఈ నిల్వలు 140 నుంచి 225 వార్‌హెడ్ల తయారీకి సరిపోతాయని తెలిపారు.

 అయితే భారత్ తన వద్ద ఉన్న ప్లుటోనియం మొత్తాన్ని ఆయుధాల తయారీకే వాడకపోవచ్చని, కొంత రిజర్వ్‌గా ఉంచుకునే అవకాశం ఉందని హాన్స్‌ క్రిస్టెన్సెన్‌ కథనం పేర్కొంది. ఆయుధ సంపత్తిని పెంచుకున్నప్పటికీ భారత్ తన విధానాలకు కట్టుబడి ఉంది. 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షల తర్వాత భారత్ ‘నో ఫస్ట్ యూజ్’ సిద్ధాంతాన్ని ప్రకటించింది. 

తమ అణ్వాయుధాలు కేవలం శత్రు దేశాలను నిలువరించటానికి మాత్రమేనని పార్లమెంటులోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా త‌న అణ్వ‌స్త్ర సామ‌ర్థ్యాన్ని నిరాంత‌రాయంగా ఆధునీక‌రిస్తున్న‌ట్లు అందులో పేర్కొన్నారు. గ‌డిచిన కొన్నేళ్ల‌లో కొత్త‌గా వెప‌న్ సిస్ట‌మ్స్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్, ల్యాండ్ డెలివ‌రీ, సీ బేస్డ్ సిస్ట‌మ్స్‌కు త‌గిన రీతిలో అణ్వాయుధాలు ఉన్న‌ట్లు తెలిపారు.

 ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా అమెరికా, రష్యా ముందు వరుసలో ఉన్నాయి. ఈ మేరుకు స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) కొద్దిరోజుల క్రితం ఒక నివేదికలో వెల్లడించింది. రష్యా వద్ద 5,420, అమెరికా వద్ద 5,042 అణు వార్‌హెడ్లు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు తొమ్మిది కాగా, వాటి వద్ద మొత్తంగా 12వేలకు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ జాబితాలో యూకే (225), ఫ్రాన్స్‌ (370), ఉత్తరకొరియా (60), ఇజ్రాయెల్‌ (90), దేశాలున్నాయి.