సంజయ్ జైస్వాల్ (బిజెపి) నేతృత్వంలో ఎఫ్‌సిఆర్‌ఎపై జెపిసి

సంజయ్ జైస్వాల్ (బిజెపి) నేతృత్వంలో ఎఫ్‌సిఆర్‌ఎపై జెపిసి

ప్రతిపాదిత ‘విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026’ను పరిశీలించేందుకు కేంద్రం 31 మంది సభ్యులతో కూడిన పార్లమెంటు సంయుక్త కమిటీని (జెపిసి) ఏర్పాటు చేసింది. ‘విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం’లో ప్రతిపాదించిన మార్పులకు సంబంధించి శాసనపరమైన పరిశీలనలో ఇది తదుపరి దశ.  బీహార్‌లోని బెట్టియా నియోజకవర్గ బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షత వహిస్తారు.

పార్లమెంటులో ఈ చట్టం తదుపరి దశకు వెళ్లే ముందు, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లులోని నిబంధనలను పరిశీలించడం మరియు ప్రతిపాదిత మార్పులను పరిగణనలోకి తీసుకోవడం ఈ కమిటీ బాధ్యత.  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో లోక్‌సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకి చెందిన 14 మంది, కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు సభ్యులు ఉన్నారు. అలాగే జెడియు, టిఎంసి, డీఎంకే పార్టీల నుండి ఇద్దరు చొప్పున సభ్యులు, ఎస్పీ, ఐయుఎంఎల్, శివసేన, ఎన్సీపీ (ఎస్పీ), ఎన్సీపీ, టిడిపి  పార్టీల నుండి ఒక్కొక్క సభ్యుడు ఇందులో ఉన్నారు. 

లోక్‌సభ సభ్యులు: సంజయ్ జైస్వాల్- చైర్‌పర్సన్; భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, కమలేష్ జంగ్డే, ముఖేష్‌ కుమార్ చంద్రకాంత్ దలాల్, నిషికాంత్ దూబే, విష్ణు దయాళ్ రామ్, అనంత నాయక్, అరవింద్ ధర్మపురి (బిజెపి), ఆంటో ఆంటోనీ, కెప్టెన్ విరియాటో ఫెర్నాండెజ్, మహమ్మద్ హమ్‌దుల్లా సయీద్, కాళీ చరణ్ ముండా (కాంగ్రెస్), జియా ఉర్ రెహ్మాన్ (ఎస్పీ), కళ్యాణ్ బెనర్జీ (టిఎంసి), ఏ రాజా (డీఎంకే), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి), నరేష్ గణపత్ మస్కే (శివసేన), కౌశలేంద్ర కుమార్ (జెడియు), సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ), ఈటి మహమ్మద్ బషీర్ (ఐయుఎంఎల్).

రాజ్యసభ సభ్యులు: సి సదానందన్ మాస్టర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, ఉజ్వల్ దేవరావ్ నికమ్, అల్కా గుర్జార్, సత్ పాల్ శర్మ (బిజెపి), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), క్రిస్టోఫర్ మాణికం (కాంగ్రెస్), మేనకా గురుస్వామి (టిఎంసి), పి విల్సన్ (డీఎంకే).