ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా దాడి చేసింది. శనివారం ఉదయం పూట ప్రజలు నిద్రలేచే సమయానికి జరిగిన ఈ దాడులతో కీవ్ నగరం ఒక్కసారిగా దద్దరిల్లింది. రష్యా సేనలు జరిపిన ఈ విణాశకర దాడితో పలు ప్రాంతాల్లో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఈ దాడిలో 9 మంది మృతిచెందగా, 22 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
సోలోమియానస్కీ జిల్లాలో ఉన్న 5 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్ దెబ్బతిన్నది. ఆ బిల్డింగ్‌లో ఉన్న 35 మంది తరలించారు. డర్నిస్టికి జిల్లాలో జరిగిన దాడి వల్ల ఏడు మంది మృతిచెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ దాడి వల్ల ఇండ్లు కూలి మంటలు వ్యాపించాయి. ఆ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
కీవ్‌పై జరిగిన ఈ వినాశకర దాడుల వెనుక తమ వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నట్లు రష్యా రక్షణ శాఖ స్పష్టం చేసింది. రాజధాని కీవ్ సమీపంలో ఉన్న కీలకమైన సైనిక పారిశ్రామిక కేంద్రాలను, అలాగే లాజిస్టిక్ హబ్‌లను (రవాణా కేంద్రాలను) లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు నిర్వహించినట్లు రష్యా అధికారికంగా వెల్లడించింది. డజన్ల సంఖ్యలో క్షిపణులను వదిలినట్లు రష్యా చెప్పింది.
హై ప్రిసిషన్ గ్రౌండ్, సీ లాంచ్డ్ వెపన్స్, లాంగ్ రేంజ్ డ్రోన్లతో అటాక్ జరిగినట్లు రష్యా మిలిటరీ శాఖ పేర్కొన్నది. మిస్సైళ్లు, డ్రోన్లు, రేడార్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఎక్విప్మెంట్ ఉన్న ప్రొడక్షన్, స్టోరేజీ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు రష్యా చెప్పింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, రష్యా ఉద్దేశపూర్వకంగానే జనసాంద్రత కలిగిన ప్రాంతాలు, కీలక మౌలిక వసతులను టార్గెట్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

More Stories
బాక్సింగ్‌లో ఏకంగా 7 పసిడి పతకాలు
పాకిస్తానీయులు మెచ్చిన ‘రామాయణ’
జుడోలో అస్మితా డేకు స్వర్ణం, జావెలిన్ త్రోలో నీరజ్‌కు రజతం