లక్షలాది భక్తుల అమర్‌నాథ్ యాత్రలో ఘోరమైన అపశృతి నెలకొంది. అమర్‌నాథ్ యాత్ర ఆరంభమై కేవలం ఐదురోజులు కాకముందే ఇక్కడి హిమ శివలింగం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో కేవలం శివలింగం చుట్టూరా ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. 57 రోజుల ఈ యాత్రకు వచ్చే భక్తులు మంచుతో కూడిన శివలింగం సందర్శించుకోవడం, ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ.
అయితే పరిసర వాతావరణంలో మార్పులు, కాలుష్యం ఇతర కారణాలతో హిమలింగం అంర్థానం అయింది. దీనితో పర్యావరణ పరిరక్షకులు మండిపడుతున్నారు. అప్పుడప్పుడు ఉగ్రవాద దాడులతో అమర్‌నాథ్ యాత్రకు విరామం ప్రకటించాల్సి వస్తుంది. ఇది సీమాంతర ఉగ్రవాద పరిణామం అయింది.
అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా అంతర్గత పరిసర వాతావరణ మార్పులతో శివలింగం కరిగిపోయింది. ఎక్కడా లేని విధంగా అమర్‌నాథ్ గుహలో మంచుతో కూడిన శివలింగం ఏర్పడుతుంది. ఈ ప్రతిమకే భక్తులు పూజాదికాలు నిర్వహిస్తారు. వ్యయప్రయాసలకు తట్టుకుని తరలివస్తారు. సాంప్రదాయం ప్రకారం ఇక్కడి హిమశివలింగం ఏర్పాటును , సృష్టిపరంగా తలెత్తే అత్యద్భుతంగా శివుడి లీలగా భావిస్తారు.
ఈ పరిణామాన్ని బాబా బర్ఫనీ అని కొలుస్తారు. గ్లోబల్ వార్మింగ్, ఇప్పటి ఎల్‌నినో, పర్వత శ్రేణువులకు జనం తాకిడి, కాలుష్యాలతో ఇక్కడి శివలింగం నిర్ణీత దర్శనకాలం ముందే అతి కొద్దిరోజుల్లోనే కనుమరుగు కావడంపై సాంప్రదాయకవాదులు తమ విశ్వాసాల పరంగా ఇది ప్రకృతికి రాబోయే ముప్పు అని ఆందోళన చెందుతున్నారు.
అయితే హిమలింగం కరిగిపోయినా దర్శనాలు సాగుతాయని యాత్ర నిర్వాహకులు ఆలయ ప్రముఖులు ప్రకటించారు. భక్తులలో దేవుడు లేని ఆలయంలో చేసేదేముంది అనే ప్రశ్న తలెత్తుతోంది. గత ఐదురోజుల్లోనే దాదాపు లక్షన్నర మంది వరకూ దర్శనానికి తరలివచ్చారు. ఇప్పుడు గంటలు మోగుతూ ఉన్నాయి. అయితే పర్యావరణ ప్రమాద ఘంటికలు వినబడుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.

More Stories
కర్ణాటక ఆలయాల్లోని విరాళాల పెట్టెలపై సీసీటీవీ నిఘా
గురుగ్రామ్ ఎన్కౌంటర్లో 60 రౌండ్ల ఫైరింగ్.. నలుగురు గ్యాంగ్స్టర్లు మృతి
షుగర్ బాధితులకు వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు!