అమ్మాయిలు `నా బాడీ నా ఇష్టం’ అని తమకు నచ్చిన బట్టలు వేసుకున్నప్పుడు, అవతలి వ్యక్తి చూసే చూపును కూడా వాడి కళ్ళు వాడి ఇష్టం అనాల్సి వస్తుందని, ఇందులో ఎవరినీ తప్పు పట్టలేమని ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ గురించి ప్రస్తావిస్తూ చురకలు అంటించారు.
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న మై బాడీ మై రైట్ అనే స్లోగన్‌పై సునీత ప్రాక్టికల్ కోణంలో మాట్లాడుతూ బట్టల పరిధిని పెంచుకోవడాన్ని లేదా తగ్గించుకోవడాన్ని తన దృష్టిలో అసలైన స్వేచ్ఛ అనరని స్పష్టం చేశారు. చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయో చూసుకోవడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు.
కేవలం బట్టలు లేదా సిగరెట్లు తాగడం సమానత్వం కాదని, సమాజంలో లేదా ఒక ఇంట్లో ఒక మహిళ తన అభిప్రాయాన్ని చెప్తే, దానికి పురుషులు ఎంతవరకు విలువ ఇస్తున్నారు? అనే దానిపై పోరాడాలని ఆమె సూచించారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై కూడా సునీత పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎవరి అభిప్రాయం వాళ్లదని చెప్పారు.
అవునని చెప్పాలన్నా, కాదని చెప్పాలన్నా మన ఇష్టమే అని పేర్కొంటూ కేవలం సినిమా పరిశ్రమలోనే కాదని, తాను జనరల్ గా లో సమాజంఉన్న అమ్మాయిల గురించి కూడా మాట్లాడుతుని ఆమె పేర్కొన్నాను. ఇక్కడ ఒక గీత గీయాలంటే, ఫుల్ స్టాప్ పెట్టాలంటే బలవంతం ఏమీ లేదని సునీత తెలిపారు. సమాజంలో జరిగే విషయాలనే సినిమాలో చూపిస్తున్నామని మేకర్స్ చెప్పే సమాధానాన్ని సునీత తప్పుబట్టారు.
కమర్షియల్ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా సమాజం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే సమాజంలో సినిమాని తిడితే, సినిమాలో సమాజాన్ని తిడుతున్నారు, సమాజం అలా ఉంది కాబట్టే తాము ఇలా సినిమా తీశామని మేకర్స్ చెబుతున్నారని సునీత పేర్కొన్నారు.

More Stories
రామమందిరం విరాళాల చోరీ కేసులో 8 మంది అరెస్ట్
వచ్చేవారం బెంగాల్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
శివరాజ్‌సింగ్ తనయుడుకు విచారం వ్యక్తం చేసిన రాహుల్