బీహార్ మంత్రివ‌ర్గంలోకి నితీశ్ కుమారుడు నిషాంత్

బీహార్ మంత్రివ‌ర్గంలోకి నితీశ్ కుమారుడు నిషాంత్

బీహార్‌ లో మంత్రిమండ‌లిని గురువారం విస్త‌రించారు. కొత్త‌గా 31 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ త‌న‌యుడు నిషాంత్ కుమార్ కూడా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. బీహార్‌లో అయిదు పార్టీల ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌

వ‌ర్న‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ స‌య్య‌ద్ అతా హ‌స్నైని మంత్రుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. నిషాంత్ కుమార్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి  విజ‌య్ కుమార్ సిన్హా, మాజీ మంత్రులు శ్రావ‌న్ కుమార్‌, అశోక్ చౌద‌రీలు కూడా ప్ర‌మాణం చేశారు.  ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌ధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, నితీశ్ కుమార్, బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా హాజ‌ర‌య్యారు.

జేడీయూ నేత నితీశ్ కుమార్ గ‌త నెల‌లో  ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో అక్క‌డ బీజేపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత ముఖ్యమంత్రిగా స‌మ్రాట్ చౌద‌రీ ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఎల్‌జేపీఆర్వీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలు కూడా ఎన్డీఏ కూట‌మిలో ఉన్నాయి.