నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సున్నితమైన అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తొలిసారిగా బహిరంగంగా స్పందిస్తూ ఈ ఘటన వెనుక ఏదైనా వ్యవస్థీకృత కుట్ర లేదా ‘కార్పొరేట్ జిహాద్’ కోణం ఉంటే, దాని అంతు చూస్తామని స్పష్టం చేశారు.
ప్రాథమిక విచారణలో ఈ దారుణం వెనుక ఒక పెద్ద ముఠా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని సీఎం తెలిపారు. “ఇది కేవలం వ్యక్తిగత వేధింపుల అంశం కాదు. దీని వెనుక ఉన్న మూలాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి” అని ఆయన పేర్కొన్నారు. “ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోం. దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కార్పొరేట్ జిహాద్ అని తేలితే దీనికి గల మూలాల్ని కూడా తెలుసుకుంటాం’’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు.
నాసిక్‌లోని టీసీఎస్ సంస్థలో మహిళా ఉద్యోగుల్ని కొందరు సీనియర్లు లైంగికంగా వేధించడంతోపాటు, బలవంతంగా మతం మారాలని బెదిరించారు. దీంతో ఈ అంశంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మంది ప్రధాన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మరో మహిళ నిదా ఖాన్ పరారీలో ఉంది.
సంస్థలో జరిగిన ఈ ఘటనను గుర్తించినందుకు ఆయన టీసీఎస్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. కంపెనీ యాజమాన్యం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిందని, పోలీసులకు దర్యాప్తులో సహకరిస్తోందని తెలిపారు.ఈ ఘటనకు మూల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారని తెలిపారు.
“అయితే, నిందితుల విషయంలో టీసీఎస్ కఠినంగానే ఉంది. ఈ ఘటనను టీసీఎస్ తీవ్రంగా ఖండించింది. పోలీసులతో టీసీఎస్ సంస్థ సహకరిస్తోంది. టీసీఎస్‌లో ఉన్న ఇలాంటి ముఠా గుట్టును బయటపెడతాం. ఈ కేసు విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం కోరతాం” అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు తీవ్రతదృష్ట్యా ఎస్‌ఐడీ, ఏటీఎస్, ఎన్‌ఐఏ వంటి దర్యాప్తు సంస్తలు విచారణలో భాగం కావాలని కరినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ తెలిపారు.
More Stories
ప్రతిపక్షాలు ‘మహిళల ఆగ్రహాన్ని’ ఎదుర్కొంటారు
లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలతో రాహుల్ పై కేసు