* బిజెపి బీహార్ కేంద్ర పరిశీలకుడిగా శివరాజ్ సింగ్ చౌహన్
ఏప్రిల్ 10న రాజ్యసభ రాజ్యసభ సభ్యునిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేయడంతో బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పర్చేందుకు బీహార్ వేగంగా సన్నాహాలు చేస్తున్నది. నితీష్ వారసుడిని ఎన్నుకునేందుకు బీహార్‌లో తన శాసనసభా పక్ష నేత ఎంపికను పర్యవేక్షించడానికి కేంద్ర పరిశీలకుడిగా బీజేపీకి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆదివారం నియమించింది.
“బీహార్‌లో బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నికకు కేంద్ర పరిశీలకుడిగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను నియమించింది. ఏప్రిల్ 14న పాట్నాలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది” అని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా తెలుపుతూ ఈ ప్రక్రియ ఏప్రిల్ 13 తర్వాత ప్రారంభమవుతుందని ఆదివారం చెప్పారు. కాగా, బీజేపీ తమ శాసనసభ పార్టీ నేతను ఎన్నుకొనే రోజుననే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగలరని తెలుస్తున్నది. ఆ రోజున ఆయన చివరి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ను కలిసిన అనంతరం సంజయ్ ఝా విలేకరులతో మాట్లాడుతూ “బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు వీలుగా, నీతీశ్ ముఖ్యమంత్రి త్వరలో పదవి నుంచి వైదొలుగుతారని భావిస్తున్నాం. ఈ ప్రక్రియ ఏప్రిల్ 13 తర్వాత ప్రారంభమవుతుందని నేను భావిస్తున్నాము” అని తెలిపారు. సంజయ్ ఝా వెంట నితీష్ కుమార్ ను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ, జేడీయూ సీనియర్ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి కూడా ఉన్నారు.
“కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఈ విషయాల్లో వారికి ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. వారు తమ ప్రణాళికతో ముందుకు వచ్చిన తర్వాత, తదుపరి చర్యలు జరుగుతాయి. బిహార్‌లో మొదటి సారిగా బీజేపీ ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ అభ్యర్థిని మాత్రం కేంద్ర నాయకత్వమే ఎంపిక చేస్తుంది. అనంతరం ఎన్డీఏ శాసనసభ పక్షం ఆ పేరును ఆమోదిస్తుంది” అని విజయ్ కుమార్ చౌధరీ తెలిపారు.

More Stories
ఎస్ఐఆర్ రెండో దశలో దేశవ్యాప్తంగా 5.38 కోట్ల ఓట్ల తొలగింపు
మహిళా రిజర్వేషన్ చట్టం సవరణకు మద్దతు కోరిన మోదీ
దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి