వికసిత భారత్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు అసెంబ్లీ గ్యాలరీ నుండి ఎపి బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నేతలు వీక్షించారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వదేశీ వస్తు వినియోగంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న కార్యక్రమం సందర్భోచితంగా ప్రస్తావించారు.
ఇదే తీర్మానంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైనశైలిలో వాక్పటిమతో మద్దతు పలికారు. తీర్మానం పై లోతైన విశ్లేషణ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ మద్దతు పలికారు. శాసనసభ సభ సమావేశాలు ముగింపు సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పివిఎన్ మాధవ్ శాసనసభ గ్యాలరీ నుండి వీక్షిస్తున్నారని చెప్పడంతో ఎమ్మెల్యే లు ఒక్క సారిగా గ్యాలరీ వైపు చూసారు.
కాగా, స్వదేశీ వస్తువుల ఉత్పత్తి వినియోగం అనే అంశం శాసనసభ, శాసనమండలి సభ్యుల దృష్టి కి తీసుకొని వచ్చేందుకు 12 రకాల స్వదేశీ వస్తువుల కిట్ లను మాధవ్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధులు పంపిణీ చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానం ఛాంబర్ కు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతు రమేష్ నాయుడు, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా చేరుకున్నారు.
అక్కడ బిజెపి శాసనసభ పక్ష నేత సోము వీర్రాజు మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానంకు వికసిత భారత్ పై వివరించారు. శాసనమండలికి మాధవ్ చేరుకోగానే స్వదేశీ కిట్ లు పంపిణీ చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ ఛాంబర్ కు చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే లకు స్వదేశీ కిట్లను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాంబర్ కు మాధవ్ నేతృత్వంలో వెళ్లి కొద్దిసేపు భేటీ అయ్యారు. అనంతరం స్వదేశీ కిట్ ఇవ్వగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరునవ్వుతో స్వికరించారు. విద్యా మంత్రి నారా లోకేష్ ఛాంబర్ కు వెళ్ళగానే లోకేష్ ఎదురు వచ్చి స్వాగతించి బిజెపి నేతలను పలకరించారు. మంత్రి నాదేండ్ల మనోహర్ తో మాధవ్ కొద్దిసేపు మాట్లాడారు.
శాసనమండలి చైర్మన్ కొయ్యేమోషేన్ రాజు స్వదేశీ కిట్ స్వీకరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ కు స్వదేశీ విధానం సరైన మార్గం అని తెలిపారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మాధవ్ స్వదేశీ కిట్ ను బహూకరించారు. శాసనసభ డిప్యూటీ చైర్మన్ రఘు రామకృష్ణం రాజు మాధవ్ ను దగ్గరకు తీసుకుని స్వదేశీ ఉద్యమాన్ని అందరూ ప్రోత్సహించాలని కోరారు.
More Stories
ఫైళ్లకే పరిమితమైన ప్రాజెక్టులను పట్టాలెక్కించాం
10 లక్షల సైనికులతో అమెరికాను ఢీకొట్టేందుకు ఇరాన్ సన్నద్ధం
పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీ రాముడు