చిరంజీవికి ఎన్టీఆర్ పురస్కారం, కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు

చిరంజీవికి ఎన్టీఆర్ పురస్కారం, కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు

తెలుగు చలనచిత్ర రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ‘గద్దర్ అవార్డుల’ (2025) విజేతల జాబితా శనివారం అధికారికంగా విడుదలైంది. ఈ ఏడాది అత్యున్నత పురస్కారాల్లో భాగంగా చిత్రసీమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అందించిన అసమానమైన సేవలకు గుర్తింపుగా ఆయనను ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో ప్రభుత్వం సత్కరించనుంది. 

అలాగే వెండితెరపై తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లోకనాయకుడు కమల్ హాసన్‌ను ‘పైడి జయరాజ్ అవార్డు’ వరించింది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ స్పెషల్ జ్యూరీ అవార్డుల వివరాలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిల్మ్‌ల నుండి ఈ ఎంపిక జరిగింది. 

ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నటి జయసుధకు ‘ఏఎన్నార్ పురస్కారం’, ప్రముఖ నిర్మాత అశ్విని దత్‌కు ‘నాగిరెడ్డి చక్రపాణి అవార్డు’, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ‘సినారే అవార్డు’ దక్కాయి. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్) ఎంపికయ్యారు. ఇక ఉత్తమ సినిమా రాజు వెడ్స్ రాంబాయి ఎంపికైంది. ఈ పురస్కారాలను ఈ నెల‌ మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా ప్రదానం చేయనున్నారు. 

  • ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్‌ రాంబాయి
  • ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
  • ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో
  • బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ – తండేల్‌
  • ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ సినిమా – కోర్ట్‌
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
  • ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ

వ్యక్తిగత విభాగాల్లో

  • ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌)
  • ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌ పరిచయ దర్శకుడు – సాయి మార్తాండ్‌ (లిటిల్‌ హార్ట్స్‌)
  • ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
  • ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా)
  • ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్‌ రాబిన్‌ (దండోరా)
  • ఉత్తమ గాయకుడు – అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
  • ఉత్తమ బాలనటుడు – మాస్టర్‌ రోహన్‌ (ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో)
  • ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్‌ – శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
  • ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కింధపురి)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – సందీప్‌ (ఛాంపియన్‌)
  • ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌ – తోట తరణి (ఛాంపియన్‌)
  • ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ – గోవిందరాజు (అఖండ 2)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – చంద్రకాంత్‌ (ఛాంపియన్‌)
  • ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ – పీటర్‌ (ఛాంపియన్‌)

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు

  • శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్‌)
  • చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • రోషన్‌ మేక (ఛాంపియన్‌)
  • అనంతిక (8 వసంతాలు)