సంస్కృత భాష‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టు

సంస్కృత భాష‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టు
 
* క్ష‌మాప‌ణ‌లు చెప్పిన హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ

హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఆ వ‌ర్సిటీలోని సౌత్ ఏషియ‌న్ స్ట‌డీస్ శాఖ సంస్క‌తృ భాష ప్రోగ్రామ్‌పై చేసిన ఓ పోస్టు వివాదం కావ‌డంతో హార్వ‌ర్డ్ వ‌ర్సిటీ దిగివ‌చ్చింది. హిందూ సంఘాల నుంచి వ‌ర్సిటీపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో ఓ ప్రకటనను విడుదలచేసింది.  సంస్కృత భాష‌కు చెందిన ఓ కార్య‌క్ర‌మంపై పోస్టు చేసిన ఇమేజ్ అభ్యంత‌ర‌క‌రంగా ఉన్న‌ద‌ని, దీని ప‌ట్లు తీవ్రంగా విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు హార్వ‌ర్డ్ వ‌ర్సిటీ పేర్కొన్న‌ది.

సౌత్ ఏషియ‌న్ స్ట‌డీస్ శాఖ‌కు సుదీర్ఘంగా సంస్కృతం బోధించిన అనుభ‌వం ఉన్న‌ద‌ని, ఆ భాష ప‌ట్ల తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, ఆ భాష‌తో లింకున్న సంస్కృతికి, మేధోసంబంధ‌మైన అంశాల‌ను గౌర‌విస్తున్న‌ట్లు హార్వ‌ర్డ్ వ‌ర్సిటీ తెలిపింది.  త‌మ శాఖ చేసే సోష‌ల్ మీడియా పోస్టుల‌పై నిఘా పెట్ట‌నున్న‌ట్లు వ‌ర్సిటీ వెల్ల‌డించింది. త‌మ శాఖ చేసిన పోస్టుకు, ల‌క్ష్మీ మిట్ట‌ల్ కుటుంబానికి సంబంధం లేద‌ని చెప్పింది.

సౌత్ ఏషియ‌న్ స్ట‌డీస్ డిపార్ట్‌మెంట్ సంస్కృత భాష కోర్సులను నిర్వ‌హిస్తోంది. ఎలిమెంట‌రీ కోర్సు ప్ర‌మోష‌న్ కోసం ఆ శాఖ త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఓ ఇమేజ్‌ను పోస్టు చేసింది.  అయితే ఆ ఫోటోలో ఉన్న ఆర్ట్ వ‌ర్క్‌ హిందువులు, సంస్కృత భాష అభిమానుల‌ను చుల‌క‌న‌గా చూపిస్తున్న‌ట్లుగా ఉంద‌ని నార్త్ అమెరికా హిందూ సంఘాలు ఆరోపించాయి. మాస్ట‌ర్ ఆఫ్ ప‌ప్పెట్స్ అన్న టైటిల్‌తో గీసిన బొమ్మ వివాదాస్ప‌దం అయ్యింది. భార‌తీయ ఆర్టిస్టు అనిరుధ్ సాయినాథ్ ఆ ఆర్ట్ వేశారు. 

మ‌హాభార‌త్‌, కృష్ణ‌రాస లీల ఆధారంగా ఆ ఆర్ట్ గీసిన‌ట్లు కొంద‌రు పేర్కొన్నారు. అయితే కృష్ణుడు తోలుబొమ్మ‌లు ఆడిస్తున్న‌ట్లుగా, అత‌ని చేతులో పాండవులు కీలుబొమ్మ‌లుగా ఉన్న‌ట్లు ఆ క‌ళాఖండంలో ఉన్న‌ది. దీన్ని అనేక హిందూ సంఘాలు వ్య‌తిరేకించాయి. ఈ నేప‌థ్యంలో హార్వ‌ర్డ్ వ‌ర్సిటీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.  సంస్కృతం క్లాసిక‌ల్ భాష అని, సుమారు మూడు వేల ఏళ్ల చ‌రిత్ర ఉన్న‌ద‌ని, దాన్ని దైవ‌భాష‌గా పిలుస్తార‌ని, ఎన్నో సాహిత‌, సైద్ధాంతిక‌, శాస్త్రీయ గ్రంధాల‌ను ఆ భాష‌లో రాసిన‌ట్లు హార్వ‌ర్డ్ త‌న వెబ్‌సైట్‌లో వెల్ల‌డించింది.