రాజ్యసభలో తొలిసారి ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. పశ్చిమబెంగాల్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఒకరు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఉన్నారు. ఆమెనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి. మేనకా గురుస్వామిని రాజ్యసభ సభ్యత్వానికి అభ్యర్థిగా ఎంపిచేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆమె 1997లో మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ. వ్యాజ్యాల విషయాలపై దృష్టి సారించి తన న్యాయవాద వృత్తిని ప్రారంభించింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లా (బిసిఎల్), హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎం పూర్తి చేసిన తర్వాత, ఆమె కొంతకాలం న్యూయార్క్‌లోని అంతర్జాతీయ న్యాయ సంస్థ డేవిస్ పోల్క్ & వార్డ్‌వెల్‌లో పనిచేశారు.
ఆ తర్వాత, న్యూఢిల్లీలో ప్రాక్టీస్ చేయడానికి భారతదేశానికి తిరిగి వచ్చింది. 2019లో, గురుస్వామి ఫారిన్ పాలసీ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ థింకర్ల జాబితాలో పేరు పొందారు. అదే సంవత్సరం, ఆమె. ఆమె భాగస్వామి, న్యాయవాది అరుంధతి కట్జు, టైమ్ మ్యాగజైన్ యొక్క ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు.
ఆమె చిత్రపటాన్ని ఆక్స్‌ఫర్డ్‌లోని రోడ్స్ హౌస్‌లోని మిల్నర్ హాల్లో ప్రదర్శించారు, ఆ గుర్తింపు పొందిన మొదటి భారతీయురాలు, రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందింది. ఇటీవల, రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయాలలో ఈడీ సోదాలను సవాలు చేస్తూ కోర్టు విచారణలో ఆమె టిఎంసికి ప్రాతినిధ్యం వహించారు.
కాగా దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్లో అయిదు స్థానాలు ఖాళీ అవుతుండగా అందులో నాలుగు తృణమూల్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీఎంసీ.. రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్‌లను తన అభ్యర్థులుగా ప్రకటించింది.
మేనకా గురుస్వామి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. 2018లో స్వలింగ బంధాల గురించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇవ్వడంలో మేనకా గురుస్వామి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభకు ఎన్నికైతే.. పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు.

More Stories
ఇకపై హార్డ్‌వేర్ రంగంలోనూ భారత్ సత్తా
మొదటిసారి రంజీ ట్రోఫీ గెలుపొందిన జమ్మూ కాశ్మీర్
దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా ప్రారంభించిన ప్రధాని మోదీ