కొంతకాలంగా పాకిస్తాన్ దేశీయులు అతడి ఇండియన్ రెస్టారెంట్‌పై తరచూ దాడి చేస్తుండటంతో చివరకు దాన్ని మూసివేస్తున్నట్లు లండన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి పోస్ట్ కలకలం రేపుతోంది. 16 ఏళ్ల నిర్వహణ తర్వాత తన రెస్టారెంట్‌ను వచ్చే నెలలో మూసేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన వివరాల్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
లండన్‌లో హర్మాన్ సింగ్ కపూర్ అనే భారత సంతతి వ్యక్తి రంగ్రేజ్ అనే భారతీయ రెస్టారెంట్‌ను హ్యామ్మర్స్మిత్ ప్రాంతంలో 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతోపాటు ఆన్లైన్ వేధింపులు, ముఖ్యంగా పాకిస్తానీయుల నుంచి తరచూ ఎదురవుతున్న దాడులు, బెదిరింపులు, అలాగే ఈ దాడుల అంశంలో పోలీసుల నుంచి సరైన మద్దతు లేని కారణంగా ఈ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించాడు.
తనకు ఇన్నాళ్లు మద్దతు తెలిపిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. తన వ్యాపారన్ని అతివాదులు అడ్డుకోవచ్చని, బిజినెస్ ఆగిపోయేలా చేయొచ్చని, కానీ, తన ఆలోచనల్ని అడ్డుకోలేరని స్పష్టం చేశాడు. అయితే, ఇకపై తనకు వ్యాపారం లేదు కాబట్టి, తాను మరింతగా రాటుదేలుతానని ప్రకటించాడు. ఇకపై తన పూర్తి సమయాన్ని తన సిద్ధాంతాల కోసమే కేటాయిస్తానని తెలిపారు.
మరింత బలంగా దూసుకెళ్తానని చెప్పాడు. హర్మాన్ సింగ్ లండన్‌లో జరిగిన ఖలిస్తాని ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. అలాగే అక్కడ పెరిగిపోతున్న హింస, అతివాద భావజాలాన్ని కూడా వ్యతిరేకించాడు. అమృత్‌పాల్ సింగ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించాడు. దీంతో అతడి రెస్టారెంట్‌పై గతంలో స్థానిక ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. అయితే, ఇకపై తాను మరింతగా ఉద్యమిస్తానని హర్మాన్ సింగ్ వెల్లడించాడు.

More Stories
ఎంతకాలం ఉంటానో తెలియట్లేదు.. ట్రంప్ నైరాశ్యం
ముంబయి దాడుల సూత్రధారి రాణాకు కెనడా పౌరసత్వం రద్దు!
భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుపి