పరిశ్రమ సామర్థ్యాల పెంపు, ఉపాధి కల్పన, భవిష్యత్ సంసిద్ధత గల ప్రతిభావంతుల తయారీ లక్ష్యంగా త్వరలో క్రియేట్ ఇన్ ఇండియా పేరిట ఒక కార్యక్రమం ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. తమ ప్రస్తుత సామర్థ్యాలను పటిష్ఠం చేయడంతో పాటు ప్రపంచానికి ప్రాధాన్యతా వేదికగా భారత్ మారేందుకు ఇది వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇన్నోవేషన్‌కు ఏఐ ముప్పు అన్న వాదాన్ని ఆయన తోసిపుచ్చారు.
కొత్త టెక్నాలజీని స్వీకరించడం అంటే చేపను నీటిలోకి తీసుకెళ్లడం అని ఆయన తెలిపారు.ఏఐ పరికరాల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద హెచ్చరించారు. ఏఐ ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెంది, ప్రజాస్తామ్య వ్యవస్థలు బలహీనపడే ముప్పు ఉన్నదన్నారు.
ఏఐ వినియోగం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల అధ్యయన సామర్థ్యాలు విశేషంగా పెరిగినా విమర్శనాత్మకమైన ఆలోచనలు, ఉత్సుకతలు నీరుగారిపోకుండా చూసుకోవలసిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు. కృత్రిమ మేధ రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు అజయ్ కుమార్ సూద్ చెప్పారు. బాలల వికాసంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

More Stories
సీఈసీకి నల్లజెండాలతో నిరసనలు.. ప్రతిపక్షాల అవిశ్వాసం?
ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం వెనక్కు.. ఇరాన్ పై చర్చకు పట్టు
పశ్చిమాసియాలో పరిణామాలు ఆందోళనకరం