బెస్ట్ ర్యాంకింగ్ తో ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ

బెస్ట్ ర్యాంకింగ్ తో ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ
నియోజకవర్గాల ర్యాంకింగ్ లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి రాష్ట్రంలో టాప్ 1 స్థానం దక్కడం పట్ల బీజేపీ శాసనసభా పక్షం  హర్షం వ్యక్తం చేసింది. బీజేపీ ఎల్పీ సమావేశంలో ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు పివిఎన్ మాధవ్ తో పాటు  సహచర సభ్యులు శాలువాతో సత్కరించి సుజనాకు  అభినందనలు తెలిపారు.  175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ టాప్ 1 లో నిలవడం  ఎమ్మెల్యే సుజనా చౌదరి పనితీరు కారణంగానే అని సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొనియాడారు.   
ఈ సందర్భంగా  ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ తాను నియోజకవర్గానికి చేసింది తక్కువేనని, చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. నియోజకవర్గం లో చందా దందా లేకుండా దాదాపుగా నియంత్రించామని పేర్కొన్నారు. ర్యాంకింగ్ అనేది ప్రభుత్వ ప్రధకాలను ఏ విధంగా అమలు అయ్యాయి అనేదాని మీద ఇచ్చారని,  ఎమ్మెల్యే గా తనకు కూడా మొదటిసారి అనుభవం కాబట్టి సహకరించిన ప్రజలకూ, అధికారులకు, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.  
ఇక్కడ ఎన్నికల సమయంలో మొదటి సారి  పూర్తిగా తిరిగాను ఎన్నికలు అయిన  తర్వాత నిరంతరం తిరుగుతా ఉన్నాని, తాను చేసింది  25% లేదా 30% మాత్రమే ఉంది, ఇంకా 75% చేయవలసింది ఉందని వివరించారు.  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేయడానికి ఎంత వీలైతే అంత చేస్తున్నాని, ఇప్పటికే  ఉన్న పధకాలను తీసుకొని ఇంకా చాలా వరకు మెరుగు పరుస్తానని హామి ఇచ్చారు.
పేద , మద్య తరగతి వారు అధికంగా ఉండే నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్న మన ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి అనే దిశగా ఆలోచన చేస్తున్నామని, అందుకు తమ బృందం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తోందని తెలిపారు.  వైద్యం, విద్య, ఉపాధి రంగాలను ప్రధాన ఫోకస్ గా పనిచేస్తున్నామని,  తర్వాత మొబైల్ హెల్త్ వ్యాన్స్ పెట్టమని, వీలైనంత వరకు సుజనా ఫౌండేషన్ తో పాటు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వాళ్ళు, భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళు ఇంకా చాలామంది తన  యజ్నానికి సహకరించారని తెలిపారు.
గెలిచిన కార్పొరేటర్లు గాని, ఓడిన కార్పొరేటర్లు గాని పార్టీలకి అతీతంగా  కుల, మత, ప్రాంతాలకి అతీతంగా తమ  నియోజకవర్గంలో పనులు చేస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు లో మరింత ఆదర్శంగా ఉండేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాని భరోసా ఇచ్చారు..