కొంత మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్ చూడనిదే ఆహారం కూడా తినరని చెబుతూ సాంకేతికత మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పరీక్ష పే చర్చ- 9వ ఎడిషన్, రెండో ఎపిసోడ్ సందర్భంగా సోమవారం ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటిస్తూ సాంకేతికతపై అతిగా ఆధారపడవద్దని హెచ్చరించారు.
కృత్రిమ మేధ, మొబైల్ ఫోన్లను సాధానాలుగా ఉపయోగించాలి తప్ప, అవి మన దైనందిన జీవితాన్ని నియంత్రించేలా ఉండకూడదని స్పష్టం చేశారు.
మనం ఏఐని సమర్థవంతంగా వాడుకోవాలని, తద్వారా మన సామర్థ్యాలను పెంచుకోవాలని చెప్పారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌ను చూసి మనం భయపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.
మనం ఏఐని సమర్థవంతంగా వాడుకోవాలని, తద్వారా మన సామర్థ్యాలను పెంచుకోవాలని చెప్పారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌ను చూసి మనం భయపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులకు క్రమశిక్షణకు ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పారు. క్రీడలు లేదా ఇతర రంగాల్లో ప్రతిభ, ఆసక్తి ఉన్నప్పటికీ, విద్యను విస్మరించకూడదని, సమతుల్య దృక్పథం అలవరుచుకోవాలని స్పష్టం చేశారు. ఎంత ప్రేరణ ఉన్నా, క్రమశిక్షణ లేకపోతే, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని ప్రధాని హెచ్చరించారు.
“ఉదాహరణకు ఇద్దరు రైతులు ఒకరి నుంచి ఒకరు ప్రేరణ పొందారని అనుకుందాం. కానీ సమయానికి పనులు పూర్తి చేయకపోతే పంట దెబ్బతింటుంది. అంటే క్రమశిక్షణ లేకపోతే రైతు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణతో కూడిన ప్రేరణ మీకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది” అని ప్రధాని చెప్పారు. “విద్యార్థులకు విద్య అవసరం. దానిని తక్కువ అంచనా వేయకూడదు. నేను క్రీడల్లో రాణిస్తున్నాను. కనుక నా చదువు అవసరం లేదని పొరపాటున కూడా అనుకోవద్దు. మీలోని ప్రతిభను మీరు అభివృద్ధి చేసుకోవాలి” అని తెలిపారు.
దేశంలో స్టార్టప్‌లు ప్రారంభించడానికి మీకు 25 ఏళ్లు రావాల్సిన అవసరం లేదని, స్టార్టప్‌లను ఎప్పుడైనా ప్రారంభించవచ్చని ప్రధాని తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు పరిశ్రమ నిపుణులను సంప్రదించి, వారు ఎలా పనిచేస్తారో అర్థం చేసుకోవాలని మోదీ చెప్పారు. ‘ప్రతి మనిషికి తనపై తనకు ఎల్లప్పుడూ నమ్మకం ఉండాలి. అయితే పరిస్థితులను గమనించి, వాటిని అనుగుణంగా సర్దుకుపోవాలి’ అని ఆయన విద్యార్థులకు సూచించారు.విద్యార్థులకు ఐదు ట్రావెల్ డెస్టినేషన్స్ చెప్పండి? అని అడుగగా ముందు మన సొంత ప్రాంతాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. మన జిల్లా, నగరం, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాల జాబితాను రాసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో ఎంచుకోవాలని చెప్పారు. అనంతరం మన సమీపంలో ఉన్న ప్రాంతాల విశిష్టతను తెలుసుకుంటే, అది భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

More Stories
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?
జె ఎన్ యు విద్యార్థి సంఘం నేతల బహిష్కరణ
వామపక్షాల సిద్ధాంతం విధ్వంసానికి సూచిక