* కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు
త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి మహాశివరాత్రి పర్వదినాన స్వామి వారి ప్రసాదం ఒక ఉచిత లడ్డూ అందజేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు కోటప్పకొండ లో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వీఐపీ పాసుల విషయంలో గత అనుభవాల దృష్ట్యా వీఐపీ టికెట్లు మంజూరు చేయనున్నామని మంత్రి ఆనం తెలిపారు. వీఐపీ దర్శన టికెట్ల ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ ఆన్ లైన్ లో సైతం బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెబుతూ తమకు ఇచ్చిన టైం స్లాట్ లో మాత్రమే దర్శనం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు.
క్యూ లైన్లలో భక్తులు ఎక్కువగా వేచి చూడకుండా త్వరగా దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
క్యూ లైన్లలో భక్తులు ఎక్కువగా వేచి చూడకుండా త్వరగా దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
అలాగే మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణకు రూ.30 లక్షలు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినానికి కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లను శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
వృద్ధులు, వికలాంగులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు.
భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కలిగేలా క్యూ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఆలయ పరిసరాలు, కొండ మార్గాలు, క్యూ లైన్ల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా చేపట్టాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించాలని సూచించారు.
అలాగే తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. మహాశివరాత్రి రోజున రాత్రి పూట భక్తులు కొండపైనే ఉండే అవకాశం ఉన్నందున, భద్రతా చర్యలు మరింత చేయాలని, పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
భక్తుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని, ప్రతి విభాగం పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని మంత్రి రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా , చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద బాబు , ప్రత్తిపాటి పుల్లారావు , జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Stories
శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల లడ్డూ కల్తీలో సూత్రధారుల్ని తేల్చేందుకు కమిటీ
దివ్యాంగులకు సులభతరంగా సర్టిఫికేట్ లు ఇవ్వాలి