ఛత్తీస్‌గఢ్‌లో శనివారం భద్రతా బలగాలు జరిపిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది నక్సలైట్లు మరణించారు. సుక్మా జిల్లాలో 12 మందికి పైగా మావోయిస్టులు హతమవగా, బీజాపుర్ జిల్లాలో ఇద్దరిని పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లాలో మావోయిస్టు కేడర్ల ఉనికి గురించి అందిన సమాచారం ఆధారంగా ఛత్తీస్‌గఢ్లోని డీఆర్జీ బృందం ఆపరేషన్ నిర్వహించాయి.
జిల్లా దక్షిణ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగిందని ఓ సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఘటనా స్థలి నుంచి పలువురి నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు, బస్తర్ డివిజన్లోని నక్సల్ ప్రభావిత బీజాపుర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది.
ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య బస్తర్ డివిజన్లోని వివిధ జిల్లాల జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు 256 మంది మావోలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
దాదాపు 665 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏకే 47, ఎల్ఎంజీ, ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమెటిక్ ఆయుధాలు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 303 భర్మర్లు, బీజీఎల్ లాంఛర్లు, సింగిల్ షాట్ రైఫిల్స్, కార్బైన్లతో సహా వివిధ రకాల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిలో కొన్నింటిని ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకోగా, మరికొన్నింటిని అడవి ప్రాంతం నుంచి పునరావాసం పొందిన మావోయిస్టుల నుంచి తీసుకున్నారు.

More Stories
ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివి
ప్రళయ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగం
పంటల దహనం ముగిసినా ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం