గోవు మాంసం ఎగుమతి ముసుగులో దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ గోమాంసం అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను విశాఖ పోలీసులు ఛేదించారు. ఆనందపురం పరిధిలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్‌పై దాడులు నిర్వహించి,సుమారు 1,89,737 కిలోల 189 టన్నులు,అక్రమ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు, పశుసంవర్ధక శాఖ, పోలీసులు కలిసి ఆనందపురంలోని కోల్డ్ స్టోరేజ్‌లో తనిఖీలు చేపట్టారు. మిశ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ గేదె మాంసం పేరుతో ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ నిల్వలను ఉంచింది. అనుమానం వచ్చిన అధికారులు శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపగా అందులో అధిక భాగం ఆవు మాంసమని తేలింది.
ఎగుమతిదారుడైన మహ్మద్ ఫర్హాన్‌తో పాటు సరఫరాదారులుగా ఉన్న మన్సూర్ అలీ రషీద్ ఖురేషి లను విదేశాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవులను పెద్ద ఎత్తున వధించి ఆమాంసాన్ని గేదె మాంసంగా చూపేందుకు నకిలీ ఇన్వాయిస్లు,ఈ-వే బిల్లులు మరియు ఫోర్జరీ హెల్త్ సర్టిఫికెట్లను సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విశాఖ పోర్టు ద్వారా ఈ మాంసాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
జప్తు చేసిన మాంసం అక్రమమైనదిగా నిర్ధారణ కావడంతో దానిని నిర్వీర్యం చేయాలని కోర్టు ఆదేశించింది దీంతో జీవీఎంసీ కాలుష్య నియంత్రణ మండలి, పశుసంవర్ధక రెవెన్యూ శాఖల సమక్షంలో భారీ బందోబస్తు మధ్య 189 టన్నుల మాంసాన్ని ధ్వంసం చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ కేసుపై డిసిపి-1 వి.ఎన్. మణికంఠ చందవోలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఈ నెట్‌వర్క్‌లోని మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని తెలిపారు.

More Stories
ఐపీఎస్ సునీల్ కుమార్ బర్తరఫ్ కై రఘురామ డిమాండ్!
శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనం
శ్రీశైలం క్షేత్ర పవిత్రత కాపాడేందుకు అధికారుల అప్రమత్తం