“ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంకా ప్రతిపాదన చదవకపోవడం నాకు కొంచెం నిరాశ కలిగించింది. కొన్ని గంటల క్రితమే ఉక్రెయిన్ ప్రజలు ఆ ప్రతిపాదనను ఇష్టపడ్డారు. కానీ ఆయన చదవలేదు. ఈ శాంతి ప్రణాళికతో రష్యా బాగానే ఉందని నేను నమ్ముతున్నా. కానీ జెలెన్‌స్కీ ఆ ప్రణాళికపై సంతృప్తిగా ఉన్నారా లేరా అనే విషయం నాకు కచ్చితంగా తెలియదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవంక, ఉక్రెయిన్ సీనియర్ అధికారుల అవినీతిపై ఆరోపణలు పెరుగుతున్న కారణంగా తన తండ్రి శాంతి చర్చల నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశం ఉందని ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చెప్పడం గమనార్హం. దోహా ఫోరమ్‌లో ఉక్రెయిన్ దేశం రష్యా కంటే చాలా ఎక్కువ అవినీతిమయం అని విమర్శించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు చర్చల నుంచి వైదొలగుతారా అని విలేకరులు ప్రశ్నించగా, అది కూడా జరగొచ్చని ట్రంప్ జూనియర్ సమాధానమిచ్చారు.
మయామిలో ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య మూడు రోజుల పాటు జరిగిన చర్చలు బాగానే జరిగినప్పటికీ భద్రతా హామీలు, ప్రాదేశిక అంశాలపై ఎటువంటి నిర్దిష్ట పురోగతి లేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ ఏమాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అమెరికాతో శాంతి చర్చల పురోగతిపై ఇటీవల జెలెన్‌స్కీ మాట్లాడుతూ యూఎస్‌తో శాంతి చర్చలు నిర్మాణాత్మకంగానే ఉన్నాయని కానీ అవి సులభం కాదని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగానే ఈ శాంతి ఒప్పందం ముందుకు పోయే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో, భద్రతకు సంబధించి అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా స్వాగతించింది. ఇది తమకు అన్ని విధాల ఆమోదయోగ్యంగా ఉందని పేర్కొంది. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త వ్యూహంతో రష్యాతో సంబంధాల విషయంలో వ్యూహాత్మక స్థిరత్వాన్ని పునఃస్థాపించాలని యూఎస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదన ముందుకెళ్లకపోవడానికి రెండు అంశాలే కారణం. డోన్‌బాస్ ప్రాంతం, జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం అంశాలను పరిష్కరించుకోవడంపైనే ఉక్రెయిన్ శాంతి ఒప్పందం ఆధారపడి ఉంది.

More Stories
పాకిస్థాన్ లో’మహావతార్ నరసింహ’ చిత్రంకు నీరాజనాలు
భారత్ లో దాడులకై ఎల్ఇటి, జెఈఎంల భేటీ?
మునీర్ ను అమెరికా అరెస్టు చేసి ఉండాల్సింది