19 ఏళ్ల పండితుడు వేదమూర్తి దేవావ్రత్ మహేశ్ రేఖీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దండక్రామ పారాయాణాన్ని పూర్తి చేసిన క్రమంలో ఆ కుర్రాడిని ప్రధాని మెచ్చుకున్నారు. శుక్ల యజుర్వేదంలోని మధ్యాంధినిలో ఉన్న సుమారు 2000 మంత్రాలను ఆ యువకుడు పారాయణం చేశారు. వరుసగా 50 రోజుల్లో ఆ మంత్రాలను అతను వల్లించాడు.
ఇదో గొప్ప ఘనత అని ప్రధాని మోదీ తన ప్రశంసలో పేర్కొన్నారు. రాబోయే తరాలు ఈ అద్భుత ఘనతను గుర్తుంచుకుంటాయని తెలిపారు. భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కుర్రాడు సాధించిన ఘనతను గర్విస్తారన్నారు. ఎటువంటి అవరోధాలు లేకుండా శుక్ల యుజుర్వేదంలోని 2 వేల మంత్రాలను ఆ యువకుడు పఠించినట్లు చెప్పారు.
కాశీ నియోజకవర్గంకు చెందిన ఆ కుర్రాడు ఆ పవిత్ర పట్టణంలో అసాధారణ ఫీట్‌ను సాధించడం పట్ల సంతోషంగా ఉందని ప్రధాని తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. ఆ కుర్రాడికి మద్దతు ఇచ్చిన కుటుంబసభ్యులకు, పండితులుకు, సంస్థలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
కాశీ నియోజకవర్గంకు చెందిన ఆ కుర్రాడు ఆ పవిత్ర పట్టణంలో అసాధారణ ఫీట్‌ను సాధించడం పట్ల సంతోషంగా ఉందని ప్రధాని తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. ఆ కుర్రాడికి మద్దతు ఇచ్చిన కుటుంబసభ్యులకు, పండితులుకు, సంస్థలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
కాశీలో ఆ యువకుడిని ఊరేగించి, ఘనంగా సత్కార కార్యక్రమంతో సత్కరించారు. ఈ వేడుకలో, అతనికి బంగారు కంకణం (రూ. 5 లక్షలు విలువైనది), రూ. 1,11,116 బహుకరించారు. ఈ వేడుకలో శృంగేరి జగద్గురువుల ఆశీస్సులు అందించారు. ఈ సత్కారంలో రథయాత్ర క్రాసింగ్ నుండి మహమూర్గంజ్ వరకు సంగీత వాయిద్యాలు, శంఖు గవ్వలు, 500 మందికి పైగా వేద విద్యార్థులతో కూడిన గొప్ప ఊరేగింపు జరిగింది.
మరో వైపు హర్యానాలోని జాజర్లో ఉన్న సిద్ధ బాబా పాల్నాథ్ ఆశ్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. ప్రాణ ప్రతిష్ట, ఆత్మ భండార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సనాతన సంస్కృతి, మానవ పరిణామ క్రమంలో దాని ప్రభావాన్ని ఆయన తన ప్రసంగంలో తెలిపారు.

More Stories
చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ వీడియోపై దుమారం
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులలో 7 బిజెపి కైవసం
8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ