అంతేకాదు దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఇప్పటికే అధ్యక్షుడు సంతకాలు చేశారు. నివేదిక అందిన 45 రోజుల్లోపు ఆ సంస్థలపై ఎలాంటి ముద్ర వేయాలనే అంశంపై మంత్రులు నిర్ణయించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలన ఆరోపణల ప్రకారం, లెబనాన్, ఈజిప్టు, జోర్డాన్ వంటి దేశాల్లో పనిచేస్తున్న బ్రదర్‌హుడ్ అనుబంధ సంస్థలు ఇజ్రాయెల్, అమెరికా మిత్రదేశాలపై దాడులను ప్రోత్సహిస్తున్నాయి.
హమాస్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫ్యాక్ట్ షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ పరిపాలన ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ ఉద్యమాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించడానికి కృషి చేస్తున్నారని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేశారు.
ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కూడా ఇటీవల ముస్లిం బ్రదర్‌హుడ్‌పై చర్యలు తీసుకున్నారు. ఇది రాష్ట్ర స్థాయికే పరిమితమవుతుంది. ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ అనేది 1920లో ఈజిప్టులో స్థాపించారు. ఇస్లామిక్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని లక్ష్యం. అరబ్ దేశాలకు వేగంగా వ్యాపించిన ఈ సంస్థ రహస్యంగా పనిచేస్తుంది.
ఇదిలా ఉండగా ముస్లిం బ్రదర్‌హుడ్ కార్యకలాపాలపై ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఇటీవల మరింత దృష్టి సారించాయి. మధ్యప్రాచ్యంలో పుట్టిన ఈ సంఘం, అక్కడున్న రాజకీయ–సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన నేపథ్యంలో, అమెరికాలో దాని ప్రభావం ఎంతవరకు విస్తరించిందనే అంశంపై పరిశీలనలు కొనసాగుతున్నాయి.
సంఘంతో అనుబంధం ఉందన్న అనుమానాలపై అమెరికాలోని కొన్ని ముస్లిం కమ్యూనిటీ సంస్థలు, విద్యా సంస్థలు, ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే గ్రూపులపై ఇంటెలిజెన్స్ వర్గాలు పర్యవేక్షణను పెంచాయి. ప్రత్యేకంగా విదేశీ నిధుల ప్రవాహం, ఆ నిధుల వినియోగం, కమ్యూనిటీ ప్రోగ్రాంల పేరుతో నిర్వహించే సమావేశాల్లో జరిగే చర్చలు వంటి అంశాలు అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అయితే స్థానిక ముస్లిం నాయకులు మాత్రం ముస్లిం బ్రదర్‌హుడ్‌తో సంబంధం ఉందనే ఆరోపణలను ఖండిస్తున్నారు. అమెరికాలో తాము చట్టబద్ధంగా, రాజ్యాంగ పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఎలాంటి అతివాద భావజాలానికి తమ సంస్థలకూ సంబంధం లేదని పేర్కొన్నారు.

More Stories
షాంఘైలో ఓ భారత మహిళ వేధింపులను సమర్ధించుకున్న చైనా
ధర్మధ్వజం భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నం
ఆయోధ్య రామమందిర నిర్మాణం సంపూర్ణం.. నేడే ధ్వజారోహణం