శ్రీరామ్ జన్మభూమి తీర్థ ప్రాంతంలో జరుగుతున్న ధర్మ ధ్వజారోహణ కార్యక్రమంలో మూడో రోజూ విధి విధానాలతో పూజా అర్చనలు నిర్వహించారు. సంపూర్ణ వేద విధానంతో వివిధ పూజ్య దేవతల ఆహ్వానం, పూజలు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్రఆధ్వర్యంలో జరిగాయి.
ఆదివారం ఉదయం నుంచి వేద మర్మజ్ఞులైన ఆచార్యులు వరుసగా గణపతి పూజ, పంచాంగ పూజ, షోడశ మాత్రిక పూజలను నిర్వహించారు. అనంతరం యోగిని పూజ, ప్రాంతాధిపతి (క్షేత్రపాల) పూజ, వాస్తు పూజ, నవగ్రహ పూజ, అలాగే ప్రధాన మండలంగా రామభద్ర మండల, ఇతర సమస్త పూజ్య మండలాల ఆహ్వాన–పూజలు జరిగాయి.
ఆదివారం రోజున విష్ణు సహస్రనామం, గణేశ అథర్వశీర్షానికి ఆహుతులు సమర్పించారు. యజమానులైన డా. అనిల్ మిశ్రా, ఇతరులు తమ సతీమణులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రధాన ఆచార్య చంద్రభాన్ శర్మ, ఉపాచార్య రవీంద్ర పైతణే, యజ్ఞ బ్రహ్మ , ఆచార్య పంకజ్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా వ్యవస్థాధికారులైన ఆచార్య ఇంద్రదేవ్ మిశ్రా, ఆచార్య పంకజ్ కౌశిక్ పర్యవేక్షణలో అన్ని శుభ కార్యక్రమాలు సమర్థవంతంగా పూర్తయ్యాయి.

More Stories
అయోధ్యలో శ్రీ రామ సహస్రనామార్చన
తొలివారంలోనే 5.75లక్షల మందికి అయ్యప్ప దర్శనం
భారత నౌకాదళ డేటాను అమ్మేసిన ఇద్దరి అరెస్ట్