
“దీపావళి భారతదేశం ప్రధాన, ప్రసిద్ధ పండుగ. ఇది చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున ప్రజలు తమ ఇండ్లల్లో లక్ష్మీ దేవిని పూజించి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ ఆత్మపరిశీలన, స్వీయ-అభివృద్ధికి కూడా ఒక అవకాశం” అని రాష్ట్రపతి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “ఈ దీపాల పండుగ మన జీవితాల్లో సామరస్యం, ఆనందం, శ్రేయస్సును ప్రకాశింప చేస్తుంది. సానుకూలత ఆత్మ మన చుట్టూ ప్రబలంగా ఉంటుంది” అంటూ ట్వీట్ చేశారు. కాగా, దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగిపోయిన వేళ, సరిహద్దుల వద్ద మాతృభూమి రక్షణలో ఉన్న భద్రతా బలగాలు కూడా పండుగను ఉత్సాహంగా జరుపుకున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి పంజాబ్ అట్టారి వరకు, జమ్మూకశ్మీర్ నుంచి హరియాణా వరకు, సరిహద్దు ప్రాంతాలు దీపాల కాంతులతో మెరిశాయి.
జైసల్మేర్లో భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళిని కుటుంబసభ్యుల్లా జరుపుకున్నారు. కమాండెంట్ ముకేష్ పాంవార్ మాట్లాడుతూ “మేం దేశ రక్షకులమే కాకుండా ఒక కుటుంబం కూడా. ఇక్కడే మనందరం కలసి దీపావళి జరుపుకుంటున్నాం” అని చెప్పారు. జవాన్లు సరిహద్దు వెంబడి రంగోళీలు వేసి, మట్టి దీపాలను వెలిగించి, బాణాసంచా పేల్చారు. ప్రధాన కార్యాలయం నుంచి పండగ సందర్భంగా బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం నుంచి మిఠాయిలు, టపాసులు వచ్చాయని అధికారులు తెలిపారు. =
More Stories
ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు చెబితే పాక్కు నిద్రపట్టదు
26 లక్షల దీపాలతో చరిత్ర సృష్టించిన అయోధ్య దీపోత్సవ్
లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు