
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలపై ఆంక్షలు విధించిన కొద్ది రోజులకే, ఒక పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంలో పాల్గొన్న కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు.
రాయచూరు జిల్లాలోని సిర్వార్ తాలూకాలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ అధికారి ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 12న లింగసుగూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లో యూనిఫాం ధరించి పాల్గొన్నారు. అంతటితో ఆగకుండా చేతిలో కర్రతో కూడా పట్టుకున్న వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ కాగా వాటిని చూసిన పైఅధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి అరుంధతి చంద్రశేఖర్ విడుదల చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం, ప్రవీణ్ కుమార్ సివిల్ సర్వీసు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అతడు సస్పెన్షన్‌లోనే ఉంటారని, జీవనాధార భత్యం మాత్రమే అందుతుందని తెలిపారు. ప్రవీణ్ కుమార్ గతంలో లింగసుగూర్ ఎమ్మెల్యే మనప్ప వజ్జల్కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారని సమాచారం.
కర్ణాటక ప్రభుత్వ మైదానాలు, ఉద్వాన వనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడా మందిరాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు, భైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాల నిర్వహణపై నిషేధం విధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు.
మరోవంక, కర్ణాటకలో ఆరెస్సెస్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనేదీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ శనివారం వెల్లడించారు. రాష్ట్రంలో ఏ సంస్థనూ నిషేధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
More Stories
జమ్మూ కాశ్మీర్ కు తగిన సమయంలో రాష్ట్ర హోదా
పాక్‌లోని ప్రతి అంగుళం రేంజ్ లో బ్రహ్మోస్
గుజరాత్ మంత్రిగా రవీంద్ర జడేజా భార్య