నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్దియా? లేదా ఎంఐఎం అభ్యర్థిగా?

నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్దియా? లేదా ఎంఐఎం అభ్యర్థిగా?
 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థియా? లేక ఎంఐఎం అభ్యర్థియా? అని  బీజేపీ  రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ ప్రశ్నించారు.  కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన నవీన్ యాదవ్ — “అసదుద్దీన్ ఓవైసీ నా గురువు, రేవంత్ నా గాడ్‌ఫాదర్” అంటూ చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్–ఎంఐఎం మధ్య జరుగుతున్న చీకటి ఒప్పందాలకు తార్కాణం అని ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి వాస్తవానికి ఎంఐఎం అభ్యర్థి అని, హస్తం గుర్తు కింద ఉన్నా, ఆలోచన మాత్రం మజ్లిస్‌దే అని ఆయన ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇటీవల ఓటరు కార్డులను పంపిణీ చేసి ప్రలోభ పెట్టగా, తాజాగా మరో బాగోతం బయటపడింది — ఒకే ఇంట్లో 43 ఓట్లను నమోదు చేయించడం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠం మజ్లిస్‌కు అప్పగించాలన్న పథకంలో భాగంగానే ఈ నాటకం జరుగుతోందని సుభాష్ ఆరోపించారు.
ఒకవేళ కాంగ్రెస్‌ను, ఎంఐఎంను నమ్మితే — మళ్లీ రజాకార్ల రాక్షస పాలనే వస్తుందని, బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ కాస్తా “బ్రాండ్ రజాకార్”గా మారిపోయే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. 

 
ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టం, కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామని అసదుద్దీన్ ఓవైసీ చెబుతున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో పాతబస్తీలో ఇప్పటికే కరెంట్ బిల్లులు వసూలు చేయలేని పరిస్థితి, అధికారులపై దాడులు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం.. ఇవన్నీ నిత్యం చూస్తున్న ఘటనలే అని గుర్తు చేశారు. 
 
పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు.. కాని పాతబస్తీలో అక్రమ కట్టడాలపైకి బుల్డోజర్లు వెళ్లవు ఎందుకని సుభాష్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం — ఇవన్నీ ఒకటే అని పేర్కొంటూ ఆ పార్టీల కుట్రలను తిప్పికొట్టి బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.