
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచెర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ (ఛత్తీస్‌గఢ్) సాధారణ ప్రజల్లో కలవడానికి నిర్ణయించుకున్నారని డీజీపీ తెలిపారు. ఈ ముగ్గురు నేతలు దక్షిణ బస్తర్ దళంలో కీలక స్థానాల్లో పని చేశారని, మొగిలిచర్ల చందు (45) మావోయిస్టు స్టేట్ కమిటీ నెంబర్‌గా చేశారని వెల్లడించారు.
“కుంకటి వెంకటయ్య, మొగిలిచర్ల వెంకట్రాజు, తోడెం గంగ (ఛత్తీస్‌గఢ్) మావోయిస్టు పార్టీ నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా మావోయిస్టు పార్టీ కమిటీ రాష్ట్ర స్థాయి నేతలు. తెలంగాణ సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూజి jఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరయ్యారు. అనంతరం అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లి పిడబ్ల్యూజి కమాండర్ బాలన్న నేతృత్వంలోని దళంలో చేరారు” అని డిజిపి తెలిపారు.
ఆ తర్వాత క్రమంగా పార్టీలో ఎదిగి 35 ఏళ్లపాటు వివిధ పదవుల్లో పనిచేశారు. మావోయిస్టు పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని డిజిపి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు వికాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కుండబద్దలు కొట్టారు. మావోయిస్టు అగ్రనేతల మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆయుధాలు వదిలిపెట్టాలనే అంశంపైనే దండకారణ్యంలో విస్తృతంగా చర్చ జరుగుతోందని చెప్పారు.
ఇదేం కొత్త కాదని మావోయిస్టుల్లో ఆధిపత్య పోరు సహజమే అని స్పష్టం చేశారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు వారు లొంగిపోయినట్లు డిజిపి మీడియాకు వెల్లడించారు. మరోవైపు, హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు(45) కూడా లొంగిపోయారని డీజీపీ తెలిపారు. “ఈయన 11 ఏళ్ల వయసులోనే విప్లవగీతాలకు ఆకర్షితుడు అయ్యారు.
అనంతరం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. 1993లో నర్సంపేట దళంలో చేరిన తర్వాత రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ పదవుల్లో పనిచేశారు. కాగా ఇటీవల మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల వల్ల పార్టీ నుంచి బయటకు రావాలనుకొని భార్య తోడెం గంగ అలియాస్ సోనీతో కలిసి పోలీసుల ఎదుట లొంగి పోయారు” అని జీజీపీ తెలిపారు.
ఈ మధ్యకాలంలో 403 మంది మావోయిస్టులు లొంగిపోగా వారిలో తెలంగాణకు చెందిన 72 మంది మావోయిస్టులు ఉన్నారని డిజిపి చెప్పారు. లొంగిపోయిన 12 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణ వాళ్లే ఉన్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత మంది మావోయిస్టు కీలక నేతలు జన జీవన స్రవంతిలో కలుస్తారని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం