
నాయీ బ్రాహ్మణుల గౌరవం, గుర్తింపు తీసుకు ని రావడమే బిజెపి ధ్యేయమని ఎపి బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నాయీ బ్రాహ్మణుల సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాధవ్ నాయీ బ్రాహ్మణులకు హామీల వర్షం కురిపించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగొల గోపి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమావేశంలో 26 జిల్లాలకు చెందిన నాయీ బ్రాహ్మణుల జేఏసీ నేతలు అనేక సమస్యల్ని ప్రస్తావించారు.
యుగం ప్రారంభంలోనే నాయీ బ్రాహ్మణుల తమ వృత్తులను సేవగా భావించి పని చేసారని, భారతీయ ధర్మంలో నాయీ బ్రాహ్మణులు వృత్తి కీలకమని పేర్కొంటూ దేవాలయాల్లో తమ వృత్తి పోస్ట్ లు భర్తీ చేయాలని కోరారు. అయితే నేడు నాయీ బ్రాహ్మణులు వివక్షకు గురవుతున్న పట్టించుకోవడం లేదని, కార్పోరేటీకరణ కారణంగా వృత్తులను కోల్పోతున్నామని సంఘాలు పేర్కొన్నాయి. తమకు సంఘంలో రక్షణ కోల్పోతున్నామని తెలిపారు.
నాదస్వరం ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ పద్దతిన భర్తీ చేయడం వల్ల చాలీచాలని జీతంతో గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణులు ప్రధానంగా క్షౌరశాలలు, నాదస్వరం, డోలు వాయిద్యం, సంప్రదాయ వైద్య వృత్తిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయీ బ్రాహ్మణులకు మంచి స్థానం ఇచ్చారని, బీహార్ ముఖ్యమంత్రిగా పని చేసిన కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ఇచ్చారని నాయీ బ్రాహ్మణులు గుర్తు చేశారు.
పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేవాలయాలు లో నాదస్వరం డోలు పోస్టులు భర్తీకి కూటమి ప్రభుత్వంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులకు రాజ్యాధికారం తో పాటు గౌరవం తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణుల వల్లనే భారతీయ సాంప్రదాయ భవిష్యత్తు తరాలకు అందించటానికి వీలు కలుగుతుందని చెప్పారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మధుకర్, నాగోతు రమేష్ నాయుడు, నాయీ బ్రాహ్మణుల కార్పోరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు, బిజెపి ప్రధాన అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు పాల్గొన్నారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు
రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు