
* ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. భగవత్ పిలుపు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్‌చాలక్ డా. మోహన్ భగవత్ ఆదివారం తన పిలుపును పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల నుండి విస్తృత ప్రశంసలు అందుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భగవత్ భారతదేశాన్ని ఒక ఇల్లుతో, పీఓకేని ఒక అపరిచితుడు ఆక్రమించిన గదితో పోల్చారు, “దానిని తిరిగి తీసుకోవాల్సిన” అవసరాన్ని నొక్కి చెప్పారు. “భారతదేశం మొత్తం ఒకే ఇల్లు. కానీ నా టేబుల్, కుర్చీ, బట్టలు ఉంచిన మా ఇంటిలోని ఒక గదిని ఎవరో తొలగించారు. వారు దానిని ఆక్రమించారు. రేపు, నేను దానిని తిరిగి తీసుకోవాలి, అందుకే మనం అవిభక్త భారతదేశాన్ని గుర్తుంచుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు.
దేశ విభజన చారిత్రక బాధను ఆయన ప్రస్తావిస్తూ 1947 విభజన సమయంలో పాకిస్తాన్‌లో ఉండని సింధీ సోదరులు నిజంగా అవిభక్త భారతదేశానికి ప్రతీక అని తెలిపారు. “చాలా మంది సింధీ సోదరులు ఇక్కడ కూర్చున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. వారు అవిభక్త భారతదేశానికి వెళ్లారు. పరిస్థితులు మమ్మల్ని ఆ ఇంటి నుండి ఇక్కడికి పంపించాయి. ఎందుకంటే ఆ ఇల్లు, ఈ ఇల్లు భిన్నంగా లేవు” అని చెప్పారు.
“మనం మన ఇంట్లో ఒక గదిని వదిలి వెళ్ళాము. ఒక రోజు దానిని తిరిగి తీసుకొని మళ్ళీ స్థిరపడవలసి ఉంటుంది. మన హక్కును మనం తిరిగి తీసుకుంటాము, ఎందుకంటే అది మనది. మనమందరం సనాతనులం; బ్రిటిష్ వారు మనల్ని విచ్ఛిన్నం చేశారు”, అని భగవత్ తెలిపారు. భాష, దుస్తులు, కీర్తనలు, భవనాలు, ప్రయాణం, ఆహారం మనవని పేర్కొంటూ అవి మన సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.
కొంతమంది తమను తాము హిందువులుగా భావించరు, కానీ ప్రపంచం మొత్తం వారిని అలాగే చూస్తుందని డాక్టర్ మోహన్ భగవత్ గుర్తుచేశారు. “తమను తాము హిందువులుగా పిలుచుకోని వారు విదేశాలకు వెళతారు, కానీ అక్కడ కూడా ప్రజలు వారిని హిందువులు అని పిలుస్తారు. వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఇది జరుగుతుంది, ఎందుకంటే మన గుర్తింపు మన జన్మస్థలం, సంస్కృతి, జీవిత దృక్పథంతో ముడిపడి ఉంది. మరే ఇతర లేబుల్‌తోనూ కాదు,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రకటన భారత్ సాంస్కృతిక కొనసాగింపును సూచిస్తుంది, భారతదేశపు ఆత్మ సరిహద్దుల ద్వారా బంధించబడదు లేదా ఏ పేరుతోనూ పరిమితం చేయబడదు అనే సందేశాన్ని తెలియజేస్తుందని తెలిపారు. పాకిస్థాన్ ప్రభుత్వంకు వ్యహాతిరేకంగా పిఓకెలో హింసాత్మక నిరసనలు చెలరేగిన సమయంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యతను సంతరింప
చేసుకున్నాయి. ఈ నిరసనల సందర్భంగా ఫలితంగా 12 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
పిఓకెలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం దురాగతాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెకెజెఎఎసి) ఈ నిరసనలకు నాయకత్వం వహించింది. పీఓకే నివాసితులతో పాకిస్తాన్ సంబంధాన్ని ఈ అశాంతి వెల్లడి చేసింది, అయితే ఇస్లామాబాద్ వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రయత్నించింది. శనివారం, పాకిస్తాన్ ప్రభుత్వం నిరసనలను ముగించడానికి జెకెజెఎసితో 25 పాయింట్ల ఒప్పందంపై సంతకం చేసింది.
పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి ఎక్స్ లో వెల్లడించిన ఈ ఒప్పందంలో హింసలో మరణించిన వారికి పరిహారం, ముజఫరాబాద్, పూంచ్ డివిజన్ల కోసం రెండు అదనపు ఇంటర్మీడియట్, సెకండరీ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం ఉన్నాయి.
More Stories
శతాబ్దిలో ఆర్ఎస్ఎస్, సిపిఐ … వారెక్కడ? వీరెక్కడ?
శబరిమలలో బంగారం అదృశ్యంతో ఇరకాటంలో సిపిఎం!
పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ అదృశ్యం!