టిటిడి నిధులతో ఐదు వేల గ్రామాలలో దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించడాన్ని ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొటుకుల జాషువ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? లేదా క్రైస్తవ మత ప్రచారకురాలా? అని ప్రశ్నించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఒక హిందూ ధార్మిక సంస్థ అని, హిందూ సమాజానికి చెందిన భక్తులు సమర్పించిన నిధులతో నడచే సంస్థ అని, ఇది ప్రభుత్వ నిధులతో నడచే సంస్థ కాదని జాషువా స్పష్టం చేశారు.
ఆనేక గ్రామాల్లో ఎస్సి కాలనీల్లో హిందువులు తమకు గుడి లేదని,తమకు గుడి కావాలని కోరారమని చెబుతూ తాము ఎస్సి హిందువులమని, తాము తమ గ్రామాలలో గుడులు కట్టుకుంటున్నామని చెప్పారు. తమకు అర్చకులంగా కూడా వ్యవహరిస్తున్నామని చెలిపారు. తమ మాదిరిగానే అనేక మంది ఎస్సీ హిందువులు కోరిన మీదట తిరుమల తిరుపతి దేవస్థానం తమ ప్రాంతలలో ఆలయాలను నిర్మించిందని చెప్పారు. పాఠశాలలు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదిని, తి,తి,దేవస్థానంది కాదని స్పష్టం చేశారు.
గతంలో అంథ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దివంగత నేత వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సొమ్ముతో క్రైస్తవ మత ప్రచార కులాకు జీతాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇది సెక్యులరిజంకు వ్యతిరేక నిదర్శనం అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చాలా గ్రామాల్లో ఎస్సి కాలనీల్లో క్రైస్తవ కుటుoబాల దామాషాకు మించిన సంఖ్యలో చర్చిలు ఉండేవని గుర్తు చేశారు.
ప్రభుత్వ నియమ నిబంధలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా క్రైస్తవ సంఘాలు చర్చిలను నిర్మిస్తున్నాయిని, చట్టాన్ని గౌరవించి వాటిని నిలిపి వేయించాలని జాషువా స్పష్టం చేశారు. షర్మిల హిందూ దేవాలయాల నిర్మాణానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

More Stories
ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు
ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?