
మోదీ నాయకత్వంలో భారత్ పాలనతో పాటు ఆర్థికంగా వృద్ధి సాధించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. భవిష్యత్తులో ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపైన నిర్మాణాత్మక చర్చలతో పాటు కలిసి పనిచేయాలని పుతిన్ ఆకాంక్షించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత వారం ఫోన్ చేసి ఇరుదేశాల సంబంధాలపై చర్చించుకున్నట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది.
ఈ క్రమంలోనే రష్యా- భారత్ సంబంధాలు దృఢంగా ఉన్నాయని పుతిన్ పునరుద్ఘాటించారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ స్వతంత్ర, సార్వభౌమాధికార విధానాలను అవలంభిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా చూసుకుంటే గొప్ప ఫలితాలను సాధిస్తుంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను దాటి అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును అందుకుంది” అని పుతిన్ ప్రశంసించారు.
రష్యా- భారత్ మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేలా మోదీ వ్యక్తిగతంగానూ ఎంతో సాయం చేస్తున్నారని, ఇంకా ఇరు దేశాలు అనేక రంగాల్లో పరస్పరం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. గత వారం భారత ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజు నేపథ్యంలో పుతిన్ సందేశం పంపారని, ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడారని అధికారిక మీడియా వివరించింది.
అంతకుముందు రష్యాతో సంబంధాలపై శుక్రవారం ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలపరీక్షకు నిలిచినా రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో ముందుకే సాగుతామని తేల్చి చెప్పారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా రక్షణ బంధం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఆత్మ నిర్భరత (స్వయం సమృద్ధి) సాధించేందుకు కృషి చేస్తున్నామని, భారత్ లాంటి దేశం ఏ ఒక్కరిపైనా ఆధారపడకూడదని తెలిపారు.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’
లండన్ గాంధీ విగ్రహంపై అసభ్య రాతలపై భారత్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెటర్లకు విదేశీ లీగ్లో ఆడకుండా ఆంక్షలు