
* విద్యార్థి సంఘ అద్యక్షకునిగా ఆర్యన్ మాన్ నిర్ణయాత్మక విజయం
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్ యు) ఎన్నికల్లో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి ) అభ్యర్థి ఆర్యన్ మాన్ నిర్ణయాత్మక విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు నార్త్ క్యాంపస్లోని కమ్యూనిటీ సెంటర్లో భారీ భద్రత మధ్య ప్రారంభమైంది. 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి, మాన్ తన ఖాతాలో 28,821 ఓట్లు సాధించగా, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్ష అభ్యర్థి జోస్లిన్ నందితా చౌదరి కేవలం 12,645 ఓట్లు మాత్రమే పాలయ్యాయి.
దానితో ఎబివిపి అభ్యర్థి 16,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వామపక్షాల విద్యార్థి సంఘాలు బలపరచిన అంజలికి 5,385 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధ్యక్ష పదవితో పాటు, ఎబివిపి కార్యదర్శి (కునాల్ చౌదరి), సంయుక్త కార్యదర్శి (దీపికా ఝా) పదవులను కూడా కైవసం చేసుకుంది. అయితే, ఎన్ ఎస్ యు ఐ అభ్యర్థి రాహుల్ ఝన్స్లా యాదవ్ 29,339 ఓట్లను సాధించడంతో ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.
కార్యదర్శి పదవిని ఎబివిపికి చెందిన కునాల్ చౌదరి 23,779 ఓట్లతో గెలుచుకున్నారు. ఎన్ ఎస్ యు ఐకి చెందిన కబీర్ 9,525 ఓట్లతో చాలా వెనుకబడి ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అభ్యర్థి అభినందన 9,535 ఓట్లను సాధించింది. కాగా ఎబివిపికి చెందిన దీపిక ఝా 21,825 ఓట్లతో జాయింట్ సెక్రటరీ పదవిని గెలుచుకోగా, ఎన్ ఎస్ యు ఐకి చెందిన లవ్ కుష్ బధాన 17,380 ఓట్లను సాధించారు. వామపక్ష కూటమి అభ్యర్థి అభిషేక్ 8,425 ఓట్లను సాధించారు.
గత సంవత్సరం, ఎస్ యు ఐ అభ్యర్థి రోనక్ ఖత్రి అధ్యక్ష పదవిలో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుగల సంస్థ సంయుక్త కార్యదర్శి పదవిని కూడా కైవసం చేసుకుంది. ముందుగా, ఈవీఎంల లెక్కింపు ప్రారంభమయ్యే ముందు, అన్ని ప్రధాన విద్యార్థి సంఘాల అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ను తెరిచారు.
కాగా, ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఎబివిపిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. ఎక్స్ లో ఓ సందేశంలో, ఇది “‘దేశం ముందు’ సిద్ధాంతంపై యువత అచంచల విశ్వాసానికి ప్రతిబింబం” అని పేర్కొన్నారు.
“ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో @ABVPVoice అద్భుతమైన విజయంపై కౌన్సిల్ కార్యకర్తలకు అభినందనలు. ఈ విజయం ‘దేశం ముందు’ సిద్ధాంతంపై యువత అచంచల విశ్వాసానికి ప్రతిబింబం. ఈ విజయం కౌన్సిల్ విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మార్చే ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది” అని హోం మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జెపి నడ్డా కూడా విజేతలను అభినందించారు, “ఇది భారతదేశాన్ని ప్రకాశవంతమైన, బలమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది” అని పేర్కొన్నారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’