అమెరికాలో మ‌ళ్లీ టిక్‌టాక్‌.. చైనాతో డీల్

అమెరికాలో మ‌ళ్లీ టిక్‌టాక్‌.. చైనాతో డీల్
టిక్‌టాక్ యాప్ మ‌ళ్లీ అమెరికాలో వాడ‌నున్నారు. ఆ సోష‌ల్ మీడియా యాప్ వాడ‌కం గురించి చైనాతో డీల్ జ‌రిగిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇవాళ వెల్ల‌డించారు. టిక్‌టాక్ యాప్‌ను ఆప‌రేష‌న‌ల్‌గా ఉంచేందుకు చైనా కంపెనీతో దాదాపు ఓ ఒప్పందం కుదిరిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  టిక్‌టాక్ వ్య‌వ‌హారం గురించి చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌ర‌పనున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. 
దేశంలోని యువ‌త ఆ యాప్ కోసం ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అమెరికా, ఈయూ, చైనా మ‌ధ్య జ‌రిగిన వాణిజ్య భేటీపై ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేశారు.  చైనాకు చెందిన టెక్నాల‌జీ కంపెనీ బైట్‌డ్యాన్స్‌ టిక్‌టాక్ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ఆ యాప్ చాలా వ‌ర‌కు దేశాల్లో పాపుల‌రైంది. చైనా వ్యాపార‌వేత్త జాంగ్ యిమింగ్ 2021లో బైట్‌డ్యాన్స్ కంపెనీని స్థాపించారు. దీని ప్ర‌ధాన కార్యాల‌యంలో బీజింగ్‌లోని హైదియాన్ జిల్లాలో ఉన్న‌ది.  కరోనా స‌మ‌యంలో టిక్‌టాక్ యాప్‌కు ఫుల్ క్రేజీ వ‌చ్చింది. 
 
ఆ యాప్‌లో వీడియోల‌న్నీ వైర‌ల్ అయ్యాయి. దీంతో ఆ యాప్‌కు కౌంట‌ర్‌గా యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్ కూడా షార్ట్ వీడియోల‌ను విడుదల చేశాయి. రీల్స్‌, షార్ట్స్ పేరుతో ఆ వీడియోలు కూడా ప్ర‌స్తుతం  వైర‌ల్ అవుతున్నాయి.