టీటీడీ ఈవోగా తిరిగి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

టీటీడీ ఈవోగా తిరిగి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌
ఎపిలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. టిటిడి ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను ప్రభుత్వం తిరిగి నియమించింది. గతంలోనూ అనిల్‌ టిటిడి ఈవోగా పనిచేశారు. 2014లో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదవిలో నియమితులైన ఆయన సుదీర్ఘకాలం, 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొద్దికాలం కొనసాగారు. 
 
ప్రస్తుత ఈవో శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్‌ ప్రన్సిపల్‌ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్‌ మీనా, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండే బదిలీ అయ్యారు.  అలాగే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కృష్ణబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. మీనాకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్ నియమితులయ్యారు.
 
ఇక పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు నియమితులయ్యారు. కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా సౌరభ్‌ గౌర్‌, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ అధికారి హరిజవహర్ లాల్ స్ధానంలో అనంతరాముకు అవకాశం కల్పించార.ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ కుమార్‌‌ను నియమించారు. రెవెన్యూ (ఎండోమెంట్‌) కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌‌ను ప్రభుత్వం నియమించింది. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.