
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సోనియా గాంధీ పేరును 1980లో ఓటర్ల జాబితాలో చేర్చారని, 1983లో ఆమె భారత పౌరసత్వం పొందారని పిటిషనర్ పేర్కొన్నారు. భారత పౌరసత్వం పొందే ముందు ఓటరు హోదాను పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించారని ఆరోపించారు.
గురువారం అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా పిటిషన్పై వాదనలు ఆలకించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 10న తదుపరి విచారణకు ఆదేశించారు. ఈ పిటిషన్‌ను న్యాయవాది వికాస్ త్రిపాఠి దాఖలు చేశారు. 1983 ఏప్రిల్‌లో సోనియా భారత పౌరురాలు కావడానికి ముందే ఆమె ఓటు ఎలా వేయగలిగారనే దానిపై విచారణ చేయాలని కోరారు.
సీనియర్ న్యాయవాదులు అనిల్ సోని, పవన్ నారంగ్ ఫిర్యాదుదారుడి తరపున హాజరయ్యారు. ఫిర్యాదు ప్రకారం, మొదట ఇటాలియన్ పౌరురాలు అయిన సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5 కింద భారతీయ పౌరురాలు అయ్యారు. అయితే ఆమె పేరు 1981-82 నాటికే న్యూదిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో కనిపించింది.
ఆ సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన పత్రాల గురించి ప్రశ్నలు తలెత్తాయి. 1982లో సోనియాతోపాటు ఆమె దివంగత మరిది సంజయ్ గాంధీ పేరును ఎన్నికల జాబితా నుంచి తొలగించారని న్యాయవాది నారంగ్ ఎత్తి చూపారు. అలాంటి తొలగింపు ఆమె మునుపటి ఓటర్ల జాబితాలో నమోదు సక్రమంగా లేదని సూచిస్తుందని తెలిపారు.
ఎందుకంటే భారతీయ పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు అని ఆయన వాదించారు. పిటిషన్ పత్రాలను ఉటంకిస్తూ, ఆమెకు పౌరసత్వం మంజూరు చేయడానికి ముందు నకిలీ లేదా తప్పుడు పత్రాలను ఉపయోగించి ఓటర్ల జాబితాలో చేర్చి ఉండవచ్చని ఆరోపించారు. ఒక ప్రభుత్వ అధికారిని తప్పుదారి పట్టించారని, మోసం జరిగినట్లు కనిపిస్తోందని కోర్టుకు తెలిపారు. పోలీసుల విచారణకు అర్హమైన కేసు, అది నేరమని ఆయన చెప్పారు.
More Stories
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్కు ఎంతో కీలకం
భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్