
ప్రస్తుత ఏడాది ఆగస్టులో వస్తు సేవల పన్నులు (జిఎస్‌టి) వసూళ్లు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.5 శాతం పెరిగి రూ.1.86 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఓ రిపోర్ట్లో వెల్లడించింది. జులై నెలలో రూ.1.96 లక్షల కోట్ల వసూళ్ళతో పోల్చితే తగ్గాయని పేర్కొంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో జిఎస్‌టి చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో రూ.2.37 లక్షల కోట్ల వసూళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో రికార్డ్ స్థాయిలో రూ.22.08 లక్షల కోట్ల జిఎస్‌టి రెవెన్యూ నమోదయ్యింది. mఐదేళ్ల క్రితం 2020-21లో ఇది రూ.11.37 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్లో జిఎస్‌టి వసూళ్లు 21 శాతం పెరిగి రూ.3,989 కోట్లకు చేరింది. 2024 ఇదే ఎలలో రూ.3,298 కోట్ల జిఎస్‌టి నమోదయ్యింది. గడిచిన నెలలో తెలంగాణలో రూ.5,103 కోట్ల జిఎస్‌టి వసూళ్లయ్యింది. గతేడాది ఇదే నెలలో రూ.4,569 కోట్ల జిఎస్టితో పోల్చితే 12 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 21 శాతం వృద్ధి సాధించింది. దేశ సగటు వృద్ధి (10%) కంటే రెట్టింపు స్థాయిలో ఇది నమోదవడం విశేషం. 2024 ఆగస్టులో రాష్ట్రానికి రూ.3,298 కోట్లు రాగా, 2025 ఆగస్టులో రూ.3,989 కోట్ల రాబడి లభించింది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధిక రాబడి సాధించిన నెలగా నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే (సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అండమాన్ కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా) ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
మొత్తంగా చూస్తే, 2017 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల పన్ను వసూళ్లు నిరంతర వృద్ధి దిశగా సాగాయి. మధ్యలో కొన్ని సంవత్సరాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినా, 2025లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. జీఎస్టీతో పాటు వృత్తి పన్ను, ఇంధన రంగం కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి