
ఎస్సీలకు చెందిన అన్ని కులాలవారము అందరి ప్రగతి కోసం కలసి మెలసి పని చేయాలని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పిలుపిచ్చారు. సామాజిక సమరసత వేదిక, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితిల సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశంను అయన సికింద్రాబాద్ లోని గీత భవన్ లో మంగళవారం ఆయన ప్రారంభించారు.
75 సం,ల రాజ్యాంగం అమలులో అభివృద్ధి ఫలాలు అన్ని ఎస్సీ కులాలకు సమంగా చేరలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొంటూ రాజకీయాలు అవసరమే అయినప్పటికి రాజకీయాలు ప్రజలను విడదీస్తాయని అయన హెచ్చరించారు. ధర్మ, సంస్కృతులు ప్రజలను సమైక్యం చేస్థాయని తెలిపారు. భారత రాజ్యాంగం మేరకు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో 59 కులాలు ఉన్నాయని చెబుతూ ప్రతి కులానికి ఒక కుల దేవత, చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు.
“తెలంగాణలో వివిధ ఎస్సీ కులాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? మన అందరి మధ్య మరింతగా సద్భావము, సోదర భావం పెరగడానికి మనం యేమీ చేయాలి?” అనే చర్చను తెలంగాణ కన్వీనర్ అప్పల ప్రసాద్ నిర్వహించారు,ఈ చర్చలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ ముగింపు ప్రసంగం చేస్తూ మనం ఎస్సీలమే కాదు హిందువులం కూడా అని చెప్పారు. అరుంధతి మాత హిందువుల అందరికీ ఆదర్శ స్త్రీ అని చెబుతూ వివాహం అనంతరం అన్ని కులాలకు చెందిన కొత్త దంపతులు వశిష్ట, అరుంధతి నక్షత్రాలు చూస్తారని గుర్తు చేశారు. 17 వ శతాబ్దంలో తమిళనాడులోని శివగంగ కోటపై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ ఆత్మ బలిదానం చేసిన యువతి కుయిలి ఎస్సీ
మహిలే అని తెలిపారు.
ఐఐసిటి సీనియర్ శాస్త్రవేత్త డా. వెంకట నరసయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్, సమరసత తెలంగాణ సహా కన్వీనర్ వేణుగోపాల్, తెలంగాణ సంచార తెగల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 21 కులాలకు చెందిన 55 మంది పాల్గొనగా, ప్రతి కులం నుండి ఒక్కొక్కరిని సత్కరించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి