
* ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ పై హర్షం
తిరుపతి ప్రాశస్త్యాన్ని కాపాడడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ని ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలు సమూహం తో ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు కు బిజెపి ప్రయత్నం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రకటించారు. సారథ్యం యాత్రలో బాగంగా తిరుపతి జిల్లాలో పర్యటన సందర్భంగా బిజెపి కార్యకర్తలు సమావేశం లో మాధవ్ మాట్లాడుతూ తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం అని గుర్తు చేశారు.
తిరుపతిలో ఉన్న అన్యమత ఉద్యోగులు ను ఇతర శాఖల కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తిరుపతి నగరం స్మార్ట్ సిటీ గా వందల కోట్ల తో అభివృద్ధి చేయడం జరిగిందని చెబుతూ మతం పేరిట జరిగే ఘర్షణ లకు చరమగీతం పాడాలని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం లో పేదల సొమ్ము దారి మళ్లించి ఒక అరాచక పాలన జగన్ సాగించడంతో రాష్ట్రం నష్ట పోయిందని మాధవ్ ధ్వజమెత్తారు.
14-15 ఆర్థిక సంఘం నిధులు రూ. రెండు కోట్లు నుండి 10 కోట్ల వరకు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను కూడా వైసీపీ మాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ డి ఎ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పధం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని తెలిపారు. అధికారం లోకి ఒక్క సంవత్సరం లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడిలు వచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు అవుతున్నాయని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సరిచేస్తూ సంపద సృష్టి జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని మాధవ్ తెలిపారు. బిజెపి బలపడడానికి ఎందరో మహానుభావులు త్యాగం చేసి బలమైన పార్టీ గా రూపొందించారని పేర్కొంటూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయులు వల్ల బిజెపి ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. కార్యకర్తల శ్రమ వృదా కాకుండా బిజెపి బలపడడానికి ఒక రోడ్ మ్యాప్ ద్వారా కృషి చేస్తానని మాధవ్ ప్రకటించారు.
అంతకు ముందు, తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద శ్రీ శంకరంబాడి సుందరాచారి విగ్రహానికి నివాళులు అర్పించిన మాధవ్ తెలుగు భాష ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్ గా అభివర్ణించారు.తెలుగు భాషకు అడ్డుపడే వ్యక్తులు పై పోరాటం చేయాలని తీవ్ర స్వరంతో పిలుపు ఇచ్చారు. సుందరాచారి రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను పాడుతూ తెలుగు భాష కు వన్నె తెచ్చిన మహనీయుడు సుందరాచారి రచనలు తెలుగు భాష కు జీవం పోసాయని కొనియాడారు.
సెమీ కండక్టర్ యూనిట్ ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పై ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ హర్షం. సెమీ కండక్డర్ యూనిట్ కేటాయింపుపై ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్
కాగా, ఆంధ్రప్రదేశ్ లో సెమీ కండక్టర్ యూనిట్ ను దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల మాధవ్ హర్షం ప్రకటించారు. రూ. 468 కోట్ల పెట్టుబడితో మొబైల్స్ , సెట్ టాప్ బాక్సులు, ఆటోమోటివ్ ఈసీయూ, గృహ వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాలకు సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేయగలరని ఆయన తెలిపారు. ఈ కారణంగా ఎపి లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని మాధవ్ చెప్పారు.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా