
“మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. వారికి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుంది. ప్రస్తుతం ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ తీసుకొచ్చే 10 శాతం ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే తాము వ్యతిరేకం అని పేర్కొంటూ అసలు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్ విషయాన్ని ప్రకటించాల్సిందని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు కలిసేందుకు ప్రధాని మోదీ సమయం ఇవ్వడంలేదంటున్నారని పేర్కొంటూ కానీ, అసలు ఆయనకు సమయం ఇవ్వనిది రాహుల్ గాంధీనే అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ సమయం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి కేసుల్లో ఎవరినీ ఇప్పటివరకు అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులను ఎందుకని అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులను సీబీఐ విచారణకు అప్పగించడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు వంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని రామచందర్ రావు విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేసి అధికంగా గెలుస్తుంది కూడా అని భరోసా వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో 420 మోసాలకు పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
More Stories
`ఆపరేషన్ బ్లూ స్టార్’ పొరపాటు.. ఇందిరను కోల్పోవాల్సి వచ్చింది
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
ముస్లింలు, ఆర్ఎస్ఎస్ : వ్యక్తిగత స్మృతులు