31న చైనా పర్యటనకు ప్రధాని మోదీ

31న చైనా పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకూ రెండు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. అక్కడ టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఇక చైనా పర్యటన అనంతరం ప్రధాని మోదీ అట్నుంచి అటు జపాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. 

2019 గాల్వాన్‌ ఘటన తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటకు వెళ్తుండటం ఇదే తొలిసారి. మరోవైపు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అదనపు సుంకాల వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ సదస్సు ద్వారా భారత- చైనా సంబంధాలు పునరుద్ధరించడానికి, రెండు దేశాల మధ్య వాణిజ్యం, భద్రతా చర్చలు, ప్రాంతీయ సమస్యలపై సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయని భావిస్తున్నారు. 
 
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై రష్యా చమురు దిగుమతులపై అదనపు సుంకాలు విధించనున్నట్టు హెచ్చరించిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల్లో సక్రమంగా వ్యూహాత్మక బహుళ సంబంధాలు నెలకొల్పడంలో తను మోదీ పాత్ర కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.  ఈ పర్యటన భారత విదేశీ విధానంలో ఒక కీలక మలుపుగా భావిస్తుండగా, చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, రెండు పక్కల సంభాషణను కొనసాగించడం ద్వారా స్ధిరత్వాన్ని సృష్టించడానికి దీని ప్రయోజనాలు ఉండవచ్చని అంటున్నారు.