
దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తమిళ నటి మీరా మిథున్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె గత మూడేళ్లుగా ఈ కేసులో పరారీలో ఉంది. పోలీసులు ఆమెను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఈ నెల 11న కోర్టులో హాజరుపరచనున్నారు. 2021 ఆగస్టులో, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీరా మిథున్, ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్ లను అరెస్టు చేశారు. అప్పుడు వారు బెయిల్‌పై విడుదలయ్యారు.
అయితే, వారు కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో 2022లో కోర్టు వారిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుండి మీరా మిథున్ పరారీలో ఉంది. తాజాగా, మీరా మిథున్ తల్లి, తన కుమార్తెను రక్షించి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణలో, చెన్నై లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఢిల్లీలోని లీగల్ సర్వీసెస్ అథారిటీకి సమాచారం అందించారు. వారి సాయంతో ఢిల్లీ పోలీసులు మీరా మిథున్‌ను గుర్తించారు.
ఆమెను ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ హోమ్ లో ఉంచారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఈ నెల 11న కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ అరెస్టుతో ఈ కేసులో ఆమె పరారీ పర్వం ముగిసింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు