
భారత ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో భారతదేశం రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివి ఎన్.మాధవ్ తెలిపారు. 2028 నాటికి, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం కడప నుండి రాష్ట్ర పర్యటనను ప్రారంభిస్తూ ఉదయం శివ శివాని స్కూల్ గ్రౌండ్ లో ఆసనాలు చేశారు. అనంతరం వాయుపుత్ర కేఫ్ లో కార్యకర్తలతో ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో స్థానిక పరిస్థితులపై చర్చించారు.
తొలి గడప దేవుని కడపలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని సారధ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సహజ కవి యోగి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి, శిశు భూషణ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్, బీరం సుబ్బారెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ బొమ్మన సుబ్బరాయుడు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
దిశగా కార్యకర్తలతో యోగి వేమన, వై జంక్షన్ నుంచి ఆదిత్య ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటూ రానున్న రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన ఆలోచనలు, ప్రణాళికలను కార్యకర్తలతో పంచుకుంటున్నట్లు చెప్పారు. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశం భలే శక్తిగా ఎదిగిందని, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. జాతీయ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, దేశ జిడిపి పెరుగుతుందని చెప్పారు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందిందని మాధవ్ తెలిపారు. రాష్ట్రంతో పాటుగా రాయలసీమ జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక అభివృద్ధికి నిధులు కేటాయించిందని చెబుతూ కడప ఎయిర్పోర్ట్ సుందరీకరణ, కడప రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి బిజెపి జెండా వెళ్లాలని కార్యకర్తలకు మాధవ్ సూచించారు. పార్టీలో అందరికీ సమున్నత స్థానం లభిస్తుందని చెబుతూ సాధారణ కార్యకర్తను అయినా తనను రాష్ట్ర అధ్యక్షునిగా చేశారని గుర్తు చేశారు. కార్యకర్తలు అందరిని పార్టీ గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ