
ఈ కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందని చెబుతూ రాష్ట్రంలో మార్పు దిశగా మిషన్ సాగిస్తున్న ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిందిగా బృందాన్ని గవర్నర్ ప్రోత్సహించారు. అంతకు ముందు, తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల సామర్థ్యాలకు ఏయే విధాలుగా మరిన్ని మెరుగులు దిద్దవచ్చో ఒక మార్గసూచీని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో మిషన్ కర్మయోగి బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా మిషన్ కర్మయోగి గురించిన సమగ్ర వివరాలను ఈ బృందం వివరించింది. డిజిటల్ మాధ్యమ శక్తియుక్తులను సద్వినియోగ పరుచుకోవడం, సామర్థ్యాలకు సాన పట్టుకొనే శిక్షణను పొందడం ద్వారా భవిష్యత్తులో ఎదురుకాగల వినూత్న అవసరాలకు అనుగుణంగా, పౌరుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ వారికి రకరకాల సేవలను అందించాలన్నదే తమ మిషన్ లక్ష్యమని బృందం స్పష్టం చేసింది.
చర్చల్లో ‘ఐగాట్ కర్మయోగి’ వేదిక ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ వేదిక అన్ని విభాగాల్లోనూ అధికారులకు ‘ఎప్పుడైనా, ఎక్కడైనా’ ప్రాతిపదికన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు బాటవేస్తోంది. విభాగాల అధిపతులు తమకు ఎదురవుతున్న సవాళ్లను, తమకు ప్రత్యేక శిక్షణను అందించాల్సిన అవసరాన్నీ వివరించారు. ప్రతి ఒక్క విభాగానికీ దానికంటూ నిర్దేశించిన పరిపాలక ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉండే, విషయాలను నేర్చుకొనే పద్ధతులను రూపొందించడానికి పెద్దపీట వేయాలని వారు కోరారు.
వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులను ఐగాట్ వేదికపైకి తేవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో సామర్థ్యాల పెంపు దిశగా సాగుతున్న ప్రస్థానంలో ఒక ముఖ్యమైన ముందడుగును వేసినట్లయింది. మిషన్ కర్మయోగిలో భాగంగా జ్ఞానార్జన, అభివృద్ధి మార్గాల్లో పరిపాలనను బలోపేతం చేయాలన్న ఉమ్మడి నిబద్ధతకు ఈ ప్రయత్నాలు అద్దం పట్టాయి.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత